Smriti Irani Miss India: ‘సోషల్ వార్’‭లో స్మృతి ఇరానీకి చెందిన పాత ‘మిస్ ఇండియా’ వీడియో

దీనికి కౌంటర్‭గా 1998లో జరిగిన మిస్ ఇండియా కాంపిటీషన్‭లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్న వీడియో ఒకటి షేర్ చేస్తున్నారు బీజేపీ వ్యతిరేకులు. ఈ వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా వాడుకుంటోంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఈ వీడియోను షేర్ చేస్తూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమిర్ ఖాన్ లక్ష్యంగా రైట్ వింగ్ కార్యకర్తలు కాంట్రవర్సీ లేవనెత్తారు

Smriti Irani's 'Miss India' Video Spawns Twitter Clash

Smriti Irani Miss India: ‘పఠాన్’ సినిమాలోని షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనెల ‘బేషరం రంగ్’ పాట తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అధికారంలోని భారతీయ జనతా పార్టీ నేతలు ఈ వివాదానికి తెర లేపారు. ఆ సినిమాలో దీపిక కాషాయం రంగు బట్టలు వేసుకుని ఉండడం, షారూఖ్ ముదురు ఆకుపచ్చ రంగు బట్టల్లో ఉండడం సహా పాటలోని కొన్ని సీన్లు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంత వరకు వెళ్లిందంటే, తమ రాష్ట్రంలో ఈ సినిమా విడుదలవ్వడం అనుమానమేనంటూ ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారంటే దీనిని బీజేపీ ఎంత సీరియస్‭గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.

అయితే దీనికి కౌంటర్‭గా 1998లో జరిగిన మిస్ ఇండియా కాంపిటీషన్‭లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్న వీడియో ఒకటి షేర్ చేస్తున్నారు బీజేపీ వ్యతిరేకులు. ఈ వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా వాడుకుంటోంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఈ వీడియోను షేర్ చేస్తూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమిర్ ఖాన్ లక్ష్యంగా రైట్ వింగ్ కార్యకర్తలు కాంట్రవర్సీ లేవనెత్తారు. లాల్ సింగ్ చద్దా సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా, తాజాగా షారూఖ్ ఖాన్ లక్ష్యంగా కాంట్రవర్సీ చెలరేగింది. ఆరు నెలల వ్యవధిలో ఇది రెండవ కాంట్రవర్సీ.

1998లోని ఫిమేన్ మిస్ ఇండియా కాంపిటీషన్‭లో కాషాయ రంగు స్విమ్‌సూట్ వేసుకుని క్యాట్ వాక్ చేశారు స్మృతి ఇరానీ. ఇప్పుడు ఇదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దీపికా పదుకొనే బికినీని విమర్శించే వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం ఇదేనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాషాయ రంగు కురుచ దుస్తులు వేసుకున్న స్మృతీ ఇరానీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.