లోక్‌సభ మూడో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓటు వేయటానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మీకు సడెన్ గా అక్కడ పాము ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. షాక్ అవుతారు కదూ. ఓ పోలింగ్ కేంద్రంలోఅదే జరిగింది. పోలింగ్ ప్రారంభైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రంలో పాము కలకలం సృష్టించింది. ఈ ఘటన కేరళ కన్నౌర్ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో పాము కలకలం సృష్టించింది.
వీవీప్యాట్ యంత్రంలో ఓ పాము చుట్టచుట్టుకుని పడుకుని ఉంది. దాన్ని చూసిన పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ గందరగోళంతో కొంతసేపు పోలింగ్ ను అధికారులు నిలిపివేశారు. ఎలాగైతేనే ఆ పామును వీవీప్యాట్ యంత్రం నుంచి బయటకు తీశారు. అనంతరం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కన్నౌర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ పీకే శ్రీమతి(సీపీఐ-ఎం-ఎల్డీఎఫ్), కే సురేంద్రన్(కాంగ్రెస్ – యూడీఎఫ్), సీకే పద్మనాభన్(బీజేపీ-ఎన్డీఏ) పోటీ చేస్తున్నారు.