Sonu sood: సోనూ సూద్ చేసిన ఆ పనికి మండిపడ్డ రైల్వే శాఖ

కరొన మహమ్మారి వేళ సినీ నటుడు సోనూ సూద్ చేసిన సామాజిక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీల్ లైఫులో విలన్ పాత్రలు ఎక్కువగా చేసే సోనూ.. ఈ దెబ్బతో రియల్ హీరో అయ్యారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపుగా అప్పటి నుంచి ప్రజల మనసుల్లో మంచి వాడిగానే గుర్తింపు తెచ్చుకున్న సోనూ.. ఉన్నట్టుండి విమర్శల్లో చిక్కుకున్నారు

Sonu sood: కరొన మహమ్మారి వేళ సినీ నటుడు సోనూ సూద్ చేసిన సామాజిక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీల్ లైఫులో విలన్ పాత్రలు ఎక్కువగా చేసే సోనూ.. ఈ దెబ్బతో రియల్ హీరో అయ్యారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపుగా అప్పటి నుంచి ప్రజల మనసుల్లో మంచి వాడిగానే గుర్తింపు తెచ్చుకున్న సోనూ.. ఉన్నట్టుండి విమర్శల్లో చిక్కుకున్నారు. ఒకే ఒక్క వీడియో సోనూని తీవ్ర విమర్శల వైపుకు తిప్పింది. ఏకంగా ఈశాన్య రైల్వే శాఖ సోనూపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


ఇంతకీ ఏం జరిగిందంటే.. డిసెంబర్ 13న తన ట్విట్టర్ ఖాతాలో సోనూ ఒక వీడియో షేర్ చేశారు. 22 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో సోనూ రైల్వే బోర్డు ప్రయాణం చేస్తూ కనిపించారు. చేతిలో డోర్ వద్ద బొంగును పట్టుకుని బయటికి చూస్తూ కనిపించారు. అంతే, రైలు నియమాలను దాటి ప్రమాదకరమైన స్థితిలో ప్రయాణం చేస్తూ.. ప్రయాణికులకు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై జనవరి 4న ఈశాన్య రైల్వే సైతం స్పందించింది. ‘‘డియర్ సోనూ సూద్.. దేశంతో పాటు ప్రపంచంలోని కొన్ని లక్షమ మందికి మీరు ఎంతగానో ఆదర్శం. రైలు మెట్ల దగ్గర ప్రయాణం చాలా ప్రమాదకరం. ఇలాంటి ప్రయాణాల వల్ల ప్రయాణికులకు తప్పుడు సందేశం వెళ్తుంది. దయచేసి ఇలాంటివి చేయకండి. ప్రశాంతమైన, భద్రమైన ప్రయాణాన్ని ఆనందించండి’’ అని ఈశాన్య రైల్వే అధికార ట్విట్టర్ పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు