Festival Special Trains: పండుగ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే!

దసరా, దీపావళి పండుగలకు సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైళ్లను (Festival Special Trains)అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.

South central railway announces special trains for dussehra and diwali festivals

Festival Special Trains: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే దసరా, దీపావళి పండుగల సీజన్ సమీపిస్తుండటంతో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం వివిధ నగరాల్లో నివసిస్తున్న ప్రజలు పండుగలకు సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని అదుపు చేయడంతో పాటు ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా వివిధ మార్గాల్లో ఈ వారాంతపు స్పెషల్ ట్రైన్లను నడపాలని నిర్ణయించారు.

CM Chandrababu: డబుల్ ఇంజిన్ సర్కార్ జెట్ స్పీడ్.. పల్లెల ప్రగతికి రూ.11,085 కోట్ల నిధులు.. ఉదయగిరి సభలో సీఎం కీలక వ్యాఖ్యలు!

నాందేడ్ – హజ్రత్ నిజాముద్దీన్, జాల్నా – ఛప్రా స్పెషల్ ట్రైన్లు:

ప్రకటించిన వివరాల ప్రకారం, నాందేడ్ – హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే 07621 ప్రత్యేక రైలు (Festival Special Trains)అక్టోబర్ 17 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శనివారం, అలాగే తిరుగు ప్రయాణంలో 07622 రైలు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఔరంగాబాద్, మన్మాడ్, భోపాల్, గ్వాలియర్, ఆగ్రా మీదుగా నడుస్తుంది. అలాగే 07651 జాల్నా – ఛప్రా స్పెషల్ రైలు అక్టోబర్ 7 నుంచి 28 వరకు ప్రతి బుధవారం, రిటర్న్ ట్రైన్ (07652) అక్టోబర్ 9 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం సేవలందిస్తుంది. వీటిలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.

నాందేడ్ – ఉధ్నా మార్గంలో ప్రత్యేక సర్వీసులు – టికెట్ బుకింగ్స్ షురూ:

మరోవైపు నాందేడ్ – ఉధ్నా (07605) ప్రత్యేక రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 23 వరకు ప్రతి సోమవారం, తిరుగు ప్రయాణంలో 07606 రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు అకోలా, భుసావల్, అమల్నేర్ వంటి కీలక స్టేషన్లలో ఆగుతుంది. పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ముందస్తుగానే ఈ ప్రత్యేక రైళ్ల అవకాశాన్ని వినియోగించుకోవాలని, రద్దీ దృష్ట్యా టికెట్లు త్వరగా రిజర్వ్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.