Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ అమలుకు బ్రేక్.. వీగిపోయిన బిల్లు

Womens Reservation Bill : ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించలేదు

Special Parliament Session Women Reservation Bill not passed in Lok Sabha

Womens Reservation Bill : డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు మూడు బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై తొలుత లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. అయితే బిల్లు పాస్ కాలేదు. మొత్తం ఓట్లు 489 ఓటింగ్ లో పాల్గొన్నారు. బిల్లు పాస్ కావాలంటే మొత్తం సభ్యుల్లో 2/3 అంటే 326 ఓట్లు కావాల్సి ఉంది. కానీ ఎన్డీయేకి వచ్చిన బలం కేవలం 278 మాత్రమే. దీంతో బిల్లుకు బ్రేక్ పడింది.

వాస్తవానికి ఎన్డీయే బలం 293 కాగా.. ఓటింగ్ లో వచ్చింది 278 ఓట్లు మాత్రమే. అయితే ఓటింగ్ లో ఎన్డీయేలోనే 15 ఓట్లు తగ్గాయి. బహుశా రాహుల్ గాంధీ చెప్పిన 16 ఇదేనేమో అనే చర్చ ప్రారంభం అయ్యింది.