Rahul Gandhi : ఇది దేశ ద్రోహం.. ఈ బిల్లును మేం ఎప్పటికీ పాస్ కానివ్వం: రాహుల్ గాంధీ
Rahul Gandhi : పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
parliament special session 2026 rahul gandhi on women reservation and delimitation bill in lok sabha
- లోక్ సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
- మూడు బిల్లులపై సంచలన వ్యాఖ్యలు
- 2023 మహిళా బిల్లును పెడితే ఇప్పుడు ఆమోదిస్తాం
Rahul Gandhi : దేశ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వేగంగా అమలు చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం.. లోక్సభలో ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై శుక్రవారం సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్లు, ఈశాన్య రాష్ట్రాల వాళ్లను ఎప్పటికీ మేం పాలిస్తాం అని చెబుతున్నారు.
వాళ్ల హక్కులను లాగేసుకుంటామని చెబుతున్నారు. ఇది దేశద్రోహం చట్టం. ఈ బిల్లును మేం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ కానివ్వం. ఈ విషయంలో ప్రతిపక్షాలు అన్నీ ముక్తకంఠంతో ఒకే మాట మీద ఉన్నాయి అని తెలిపారు. ఈ బిల్లు పాస్ కానివ్వమని.. దీనిపై భయపడొద్దని దక్షిణాది వాళ్లు, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల వారికి భరోసా ఇస్తున్నామన్నారు రాహుల్ గాంధీ.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పుడు బీజేపీ తెచ్చింది అసలు మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు. 2023లో ఆల్రెడీ మహిళా బిల్లు పాస్ అయింది. కావాలంటే మళ్లీ అదే బిల్లు తీసుకుని వస్తే ఈ క్షణమే ఆ బిల్లు పాస్ అయిపోతుంది. అందరూ మద్దతిస్తారు. మహిళల వెనుక దేశ రాజకీయాలను తమవైపు లాక్కునేందుకు బీజేపీ కుట్ర. ఓబీసీ హక్కులను లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నం’’ అంటూ విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీని ఇంద్రజాలికుడితో పోల్చారు. బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ అంతా మాయాజాలం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ కామెంట్స్ పై అధికార సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. దీంతో నేడు చర్చ జరుగుతున్న అంశం మీదే మాట్లాడాలంటూ స్పీకర్ రాహుల్ గాంధీకి సూచించారు.
