cm stalin
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీలు, కర్మాగారాల్లో కార్మికుల పని గంటలను 12 గంటలకు పెంచుతూ ప్రభుత్వం ప్రత్యేక బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడంపై తీవ్ర వ్యతిరకత వ్యక్తం అవుతోంది. రాష్ట్ర శాసనసభలో కార్పొరేట్ సంస్థలకు అనువుగా పనిగంటలు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లు వెనుక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ హస్తం ఉందని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో మండిపడ్డారు. పని గంటలు పెంచడం వల్ల శ్రామిక వర్గాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.
ఈ సమస్యను పరిష్కరింపజేసేలా ఈనెల 24న సోమవారం కార్మికుల సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాపనులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక సంక్షేమ శాఖల మంత్రులు గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించనున్నారు. కర్మాగారాల చట్టాన్ని మిత్రపక్షాల మద్దతు లేకుండా శాసనసభలో శుక్రవారం ఆదరాబాదరగా ప్రవేశపెట్టడం కార్మికుల సంక్షేమ సిద్ధాంతాలకు విరుద్ధమని డీపీఐ అధ్యక్షుడు తిరుమావళవన్ విమర్శించారు.
Maharashtra: షిండే ప్రభుత్వాన్ని ఉద్ధవ్ సేన డెత్ వారెంట్.. 15 రోజుల్లో కూలిపోతుందంటూ స్టేట్మెంట్