Weather Updates : అటు రెండు తుఫాన్లు.. ఇటు భీకర ఎండలు.. సముద్రంలో ఏం జరుగుతోంది..?

Weather Updates : ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు హీట్ వేవ్ ఎక్కువగా ఉంటాయని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఏప్రిల్ చివరి వారంలో ఉంది. కానీ, ప్రస్తుతానికి డ్రై ఉంటుంది. ఈ నెలాఖరులో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది.

Weather Updates

Weather Updates : వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఎండలు సుర్రుమనిపిస్తుండగా.. మరోవైపు సాయంత్రం వేళల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితితో ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ పరిస్థితులు వింతగా మారుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. భూతాపం మొత్తం ప్రపంచాన్నే ముంచుతోంది. దాని ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపైనా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సముద్రంలో ఏం జరుగుతోంది..? ఈ వింత వాతావరణ పరిస్థితులకు కారణం ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది.

Also Read : Weather Updates : ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మరోవైపు తీవ్ర వడగాల్పులు.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..

భూతాపం కారణంగా ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో రెండు భయంకరమైన తుపానులు ఏర్పడ్డాయి. అవి మైలా సైక్లోన్, సిన్లాకు టైఫూన్. మరి వీటి ప్రభావం ఏపీ, తెలంగాణపై ఏ స్థాయిలో ఉంటుందనే సందేహం రావొచ్చు. ప్రస్తుతం ఈ రెండు తుఫానులు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. వీటి ప్రభావం ప్రస్తుతానికి బంగాళాఖాతంలో లేదు. అరేబియా సముద్రంపై లేదు. కానీ, మనకు హీట్ వేవ్ హెచ్చరికలు వచ్చేశాయి.

మైలా సైక్లోన్ వల్ల మన భారతదేశానికి ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం లేదు. ఇది ఫసిఫిక్ మహా సముద్రంలోనే ఉంటుందని ఆస్ట్రేలియా BOM బులెటిన్ లో తెలిపారు. మరోవైపు.. పసిఫిక్ మహాసముద్రంలోని సిన్లాకు టైపూన్‌తో ఏపీ తీరంపై ఎలాంటి లింక్ లేదు. కానీ, దీని వల్ల భారీగా మేఘాలు పుడుతున్నాయి.

ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు హీట్ వేవ్ ఎక్కువగా ఉంటాయని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఏప్రిల్ చివరి వారంలో ఉంది. కానీ, ప్రస్తుతానికి డ్రై ఉంటుంది. ఈ నెలాఖరులో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు జిల్లాల్లో 42డిగ్రీలకుగాపై ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు బయటకు వచ్చేటప్పుడు ఎండదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎండ తీవ్రతతోపాటు ఉక్కపోతసైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మళ్లీ సాయంత్రం వచ్చేసరికి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మొత్తానికి వాతావరణంలో రోజురోజుకు విచిత్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనంతటికీ సముద్రంలో జరుగుతున్న మార్పులే కారణమని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. రానురాను భూమి మొత్తం వేడి పెరుగుతోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రం బాగా వేడెక్కుతోంది. అందువల్లే వాతావరణంలో విపరీత మార్పులు వస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.