Covid Curbs In Maharashtra: మహారాష్ట్రలో మహమ్మారి- ఆఫీసుకు 15%, పెళ్లికి 25మందే

వర్క్ ఫోర్స్ 50శాతానికి మించకూడదని సూచించింది. అత్యవసర సేవలు నిర్వహించే వారు కూడా వీలైనంత వరకూ తక్కువ మంది స్టాఫ్ ..

Covid Curbs In Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ ద చైన్ పేరిట మరికొన్ని నియమాలు ప్రకటించింది. రాష్ట్రంలో వేగవంతంగా పెరిగిపోతున్న కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని బుధవారం ఈ ప్రకటన చేసింది. గురువారం సాయంత్రం 8గంటల నుంచి మే1 ఉదయం 7గంటల వరకూ వీటిని అమలు చేయాలని ఆదేశించింది.

కొత్త రూల్స్ ప్రకారం.. అన్నీ ప్రైవేట్, గవర్నమెంట్ ఆఫీసుల్లో స్టాఫ్, మేనేజ్మెంట్ లు డైరక్ట్ కాంటాక్ట్ ఉండకూడదని చెప్పింది. అంతేకాకుండా కేవలం 15శాతం స్టాఫ్ మాత్రమే అందుబాటులో ఉండాలని చెప్పింది. అత్యవసర సేవలను తక్కువ మంది స్టాఫ్ తో పూర్తి చేయాలని చెప్పింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ వర్క్ ఫోర్స్ 50శాతానికి మించకూడదని సూచించింది. అత్యవసర సేవలు నిర్వహించే వారు కూడా వీలైనంత వరకూ తక్కువ మంది స్టాఫ్ ను వినియోగించుకోవాలి. ఒకవేళ అవసరమైతే 100శాతం మందిని వాడుకునే వెసలుబాటు కూడా ఉంది. మ్యారేజీలు, సెలబ్రేషన్లు లాంటి సమయంలో 25మందికి మించి అనుమతి లేదు.

ఈ ఈవెంట్లు సింగిల్ హాల్ లో నిర్వహిస్తూ రెండు గంటలకు మించకుండా పూర్తి చేయాలి. ఈ రూల్ అతిక్రమిస్తే రూ.50వేల ఫైన్ చెల్లించాలని హెచ్చరించింది. ప్రైవేట్ వెహికల్స్ వాడుకుని, బస్సులను మినహాయించాలి. మెడికల్ ఎమర్జెన్సీలు, తప్పనిసరి ప్రయాణాల్లో 50శాతం కెపాసిటీతో మాత్రమే ప్రయాణించాలి. రూల్ బ్రేక్ చేస్తే రూ.10వేలు ఫైన్ తప్పదు. రిపీటెడ్ గా రూల్ బ్రేక్ చేస్తే వాహనాల లైసెన్స్ రద్దు అవుతుందని వార్నింగ్ ఇచ్చింది.

ప్రయాణికులు తప్పనిసరిగా వ్యాలిడ్ ఐడీ తమ దగ్గర ఉంచుకోవాలి. రాష్ట్రాలు నిర్వహించే బస్సుల్లో 50శాతం కెపాసిటీతో మాత్రమే ప్రయాణించాలి. ఇక ప్రయాణికులంతా హ్యాండ్ స్టాంపులు వేయించుకోవాలి. బస్ ఆపరేటర్ వేసే స్టాంపులతో 14రోజుల హోం క్వారంటైన్ పీరియడ్ లో ఉంచాలి. అంతేకాకుండా అవసరమైనప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించుకుని బస్ ఎక్కాల్సి ఉంటుంది.

దేశంలోనే దారుణంగా కేసులు నమోదవుతున్నాయి మహారాష్ట్రలో. కేవలం బుధవారం ఒక్క రోజే 67వేలు కొవిడ్ కేసులు నమోదు కాగా, 568మంది చనిపోయారు. నాశిక్ లో ట్యాంకర్ లో లీక్ రావడంతో ఆక్సిజన్ సప్లై అందక 24మంది చనిపోయారు.

ట్రెండింగ్ వార్తలు