టీచర్‌పై దాడి చేసిన విద్యార్థులు…వీడియో వైరల్

  • Publish Date - November 13, 2019 / 04:20 AM IST

చదువు నేర్పే టీచర్ పైన విద్యార్థులంతా కలిసి దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని రాయ్‌ బరేలీలో చోటుచేసుకుంది. రాయ్ బరేలీలో గాంధీ సేవా నికేతన్‌ లో అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న మమతా దూబేపై సోమవారం (నవంబర్ 11, 2019)న ఈ దాడి జరిగింది. దీంతో మమతా పిల్లలపై మంగళవారం (నవంబర్ 12, 2019)న పోలిస్ స్టేషన్ కు వెళ్లి కంప్లెయింట్ చేసింది.

రెండు గ్రూపుల విద్యార్ధులు గొడవ పడుతున్న సమయంలో వారి మధ్య వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించినందుకు వారంతా కలిసి టీచర్ పై దాడి చేశారని మమతా  తన కంప్లెయింట్ లో తెలిపారు. 

మొదట విద్యార్థులు ఆమె చుట్టూ చేరి వాదనకు దిగారు. ఒక విద్యార్థి ఆమె హ్యాండ్‌ బ్యాగును విసిరేశాడు. ఆమె వెళ్లి ఆ బ్యాగును తెచ్చుకుంది. మళ్లీ అదే విద్యార్థి ప్లాస్టిక్‌ కుర్చీతో ఆమెను కొట్టాడు. ఈ ఘటన అంతా క్లాస్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.