Electric Wire: ఎలక్ట్రిక్ వైర్ సహాయంతో నది దాటుతున్న విద్యార్థులు

ఎలక్ట్రిక్ వైర్ సహాయంతో నది దాటుతున్న విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట్ వైరల్ అయింది. ప్రాణాంతకమైన రీతిలో విద్యార్థులు గంజామ్ జిల్లాలోని బెరంపూర్ ఏరియాలో నదికి అటువైపున్న స్కూల్‌కు వెళ్లేందుకుగానూ ఈ తంటాలు పడుతున్నారు. పెద్ద రాళ్ల మధ్య నడుస్తుండగా అదృష్టవశాత్తు ఏ గాయం కాలేదు.

Students

Electric Wire: ఎలక్ట్రిక్ వైర్ సహాయంతో నది దాటుతున్న విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట్ వైరల్ అయింది. ప్రాణాంతకమైన రీతిలో విద్యార్థులు గంజామ్ జిల్లాలోని బెరంపూర్ ఏరియాలో నదికి అటువైపున్న స్కూల్‌కు వెళ్లేందుకుగానూ ఈ తంటాలు పడుతున్నారు. పెద్ద రాళ్ల మధ్య నడుస్తుండగా అదృష్టవశాత్తు ఏ గాయం కాలేదు.

స్కూల్ యూనిఫామ్స్ ధరించి ఒకరితర్వాత ఒకరు నది దాటుతున్నట్లుగా చూడొచ్చు. స్టూడెంట్లతో పాటుగా చాలా మంది విశాలమైన నది దాటుతున్నారు.

మరో ఘటనలో వవాంజె ప్రాంతంలోని పన్వేల్ ప్రాంతంలో యువత ప్రాణాలకు తెగించి లోతైన లోయలోకి పడిపోకుండా దూడను కాపాడారు. ఈ సాహసోపేతమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు యువతను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read Also : బోరు బావిలో పడ్డ బాలుడు-సాహసం చేసి కాపాడిన యువకుడు

వవాంజె జిల్లాలోని మలాంగ్గడ్ ప్రాంతంలో మూణ్నాలుగు రోజుల పాటు దూడ అలానే ఉండిపోయింది. పైకి రావడానికి తీవ్రంగా ప్రయత్నించి అలసిపోయింది. దానిని కాపాడే క్రమంలో యువత ప్రాణాలకు తెగించి ముందడుగేశారు.