BJP MP Subramanian Swamy: నాడు కమ్యూనిస్టులు, నేడు మోదీ చుట్టూ ఉన్న గూండాలు.. సుబ్రమణ్యస్వామి ఘాటు వ్యాఖ్యలు

సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక నెటిజెన్ ఎకానామిక్స్ క్లాసులు చెప్తున్న ఒకప్పటి సుబ్రమణ్యస్వామి ఫొటో ఒకటి ట్విట్టర్‭లో షేర్ చేశాడు. ‘డాక్టర్ సుబ్రమణ్యస్వామికి టీచర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. చాలా మంది నెటిజెన్ల కామెంట్లకు స్పందించే సుబ్రమణ్యస్వామి.. ఈ ట్వీట్‭కు కూడా స్పందిస్తూ ‘హర్వార్డ్‭లో 1985-86 నాటి వింటర్ సెషన్’ అని ఒకప్పటి తన జ్ణాపకాల్ని గుర్తు చేసుకున్నారు.

BJP MP Subramanian Swamy: ఎవరిపైనైనా అలవోకగా విమర్శలు చేయగలిగే వ్యక్తుల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అగ్రజులు. విపక్షాలపై ఎంత సునాయాసంగా విమర్శలు చేస్తారో, తమ పార్టీ నేతలపై కూడా అంతే సునాయాసంగా, సూటిగా, ఘాటుగా స్పందిస్తుంటారు. కొంత కాలంగా విపక్షాల కంటే కూడా ఎక్కువగా మోదీనే టార్గెట్ చేశారు. ఆ మధ్య ఒకసారి అయితే పీఎంవోలో సైకోలు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. తాజాగా మోదీ చుట్టూ ఉన్నవారిని ఉద్దేశించి గూండాలు విమర్శలు గుప్పించడం తాజా దుమారానికి దారి తీసింది.

సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక నెటిజెన్ ఎకానామిక్స్ క్లాసులు చెప్తున్న ఒకప్పటి సుబ్రమణ్యస్వామి ఫొటో ఒకటి ట్విట్టర్‭లో షేర్ చేశాడు. ‘డాక్టర్ సుబ్రమణ్యస్వామికి టీచర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. చాలా మంది నెటిజెన్ల కామెంట్లకు స్పందించే సుబ్రమణ్యస్వామి.. ఈ ట్వీట్‭కు కూడా స్పందిస్తూ ‘హర్వార్డ్‭లో 1985-86 నాటి వింటర్ సెషన్’ అని ఒకప్పటి తన జ్ణాపకాల్ని గుర్తు చేసుకున్నారు.

చర్చ ఇంతటితోనే ఆగితే అంతగా చర్చనీయాంశమయ్యేది కాదు. కానీ ఒక నెటిజెన్ స్పందిస్తూ ‘రాజకీయాల్లోకి రావడానికి ఆర్థిక శాస్త్రాన్ని వదులుకున్నందుకు మీకెప్పుడైనా బాధ కలిగిందా?’ అని స్పందించాడు. ఇక ఈ కామెంటుకు స్పందించిన ఆయన అలా లేదని చెప్తూనే తన స్థానాన్ని ఇప్పుడు మోదీ చుట్టూ ఉన్న వారు గూండాలని, వారు తనను భర్తీ చేయాలని చూస్తున్నారని ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు ఐఐటీ ఢిల్లీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‭గా ఉన్న సమయంతో తనను భర్తీ చేయాలని కమ్యూనిస్టులు వారి తొత్తులు ప్రయత్నించారని, ఇప్పుడు మోదీ చుట్టూ ఉన్న గూండాలు తనను భర్తరఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సుబ్రమణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Operation Lotus Failed: మొన్న రాజస్తాన్, నిన్న ఢిల్లీ, నేడు జార్ఖండ్.. ‘ఆపరేషన్ కమల’ ఫెయిల్! బీజేపీ జోరు తగ్గిందా?

ట్రెండింగ్ వార్తలు