Operation Lotus Failed: మొన్న రాజస్తాన్, నిన్న ఢిల్లీ, నేడు జార్ఖండ్.. ‘ఆపరేషన్ కమల’ ఫెయిల్! బీజేపీ జోరు తగ్గిందా?

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ప్రారంభం కావడం.. అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షకు వెళ్లడం, అక్కడ ఓడడం, తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, చివరగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం.. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగింది ఇదే. ఈ రెండు రాష్ట్రాల అనంతరం ఇక రాజస్తాన్ వంతేనని అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి అనుగుణంగానే రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబాటుకు పూనుకున్నారు

Operation Lotus Failed: మొన్న రాజస్తాన్, నిన్న ఢిల్లీ, నేడు జార్ఖండ్.. ‘ఆపరేషన్ కమల’ ఫెయిల్! బీజేపీ జోరు తగ్గిందా?

Is Operation Lotus Failed? What is the message given by those three states?

Operation Lotus Failed: ‘‘ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రభుత్వం మాత్రం భారతీయ జనతా పార్టీనే ఏర్పాటు చేస్తుంది’’ అన్న కామెంట్ సోషల్ మీడియాలో తరుచూ వినిపిస్తూ ఉంటుంది. గోవా, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో తక్కువ సీట్లు సాధించినప్పటికీ ఇతర పార్టీ ఎమ్మెల్యేల్ని తమ పార్టీలోకి లాక్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎన్నికల అనంతరం ఏర్పడ్డ ప్రభుత్వాలైతే విపక్ష పార్టీల ప్రభుత్వాలు కూలిపోయిన తర్వాత (బీజేపీనే కూల్చిందనే విమర్శలు ఉన్నాయి) బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్.. తాజాగా మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జరిగింది ఇదే.

ఒక్కసారి ఆపరేషన్ కమల ప్రారంభమైతే విపక్ష ప్రభుత్వం కూలడం, ఆ స్థానంలో కమల పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయమేమీ కాదనే మాట చాలా మంది నుంచి వినిపిస్తూ ఉంటుంది. అయితే బీజేపీ దూకుడు ఈ మధ్య తగ్గినట్లు కనిపిస్తోంది? ఇందుకు కారణం.. ఆపరేషన్ కమల వరుస ప్లాపులు మూటగట్టుకోవడమేనని అంటున్నారు. వాస్తవానికి బీజేపీ ఆపరేషన్ కమల ప్రమేయం ఎంత వరకు ఉందనేది తెలియదు కానీ, విపక్షాలు మాత్రం ఈ ఆరోపణ బలంగా చేస్తూ తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాయి. ఈ మధ్య ఒక్క మహారాష్ట్ర మినహా మూడు రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిందని అంటున్నారు.

Amit Shah vs Thackeray: ఉద్ధవ్ థాకరేకి గుణపాఠం చెప్పాల్సిందే.. MVA ప్రభుత్వం కూలిన 2 నెలల తర్వాత తీవ్ర కంఠంతో గర్జించిన అమిత్ షా

రాజస్తాన్
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ప్రారంభం కావడం.. అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షకు వెళ్లడం, అక్కడ ఓడడం, తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, చివరగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం.. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగింది ఇదే. ఈ రెండు రాష్ట్రాల అనంతరం ఇక రాజస్తాన్ వంతేనని అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి అనుగుణంగానే రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబాటుకు పూనుకున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‭ను వ్యతిరేకిస్తూ తనకు అనుకూలంగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో రెబల్ జెండా ఎగరేశారు. ఇక రాజస్తాన్ ప్రభుత్వం కూడా కూలిపోతుందనే అనుకున్నారంతా. కానీ, స్వతహాగా మెజీషియన్ అయిన గెహ్లోత్ తన మ్యాజిక్‭తో బలపరీక్షలో నెగ్గారు. అంతే.. తిరుగుబాటు వదిలేసి పైలట్ వెనక్కి రావడం. రాజస్తాన్ రాజకీయ సంక్షోభం సమసిపోవడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి.

ఢిల్లీ
బీజేపీ నిజంగానే ఆప్ ఎమ్మెల్యేలను లాగడానికి ప్రయత్నించిందో లేదో కానీ.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా ఆప్ నేతలంతా ఈ ఆరోపణలు చాలా బలంగా చేశారు. హార్స్ ట్రేడింగ్ చేస్తున్నారని, ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆశ చూపుతున్నారని ఏవేవో విమర్శలు చేశారు. ఈ ఊపుతోనే అసెంబ్లీలో బలపరీక్షకు దిగారు కేజ్రీవాల్. ఒకవైపు లిక్కర్ పాలసీపై రాజకీయ దుమారం, మరోవైపు ఆపరేషన్ కమల దుమారం. ఈ రెండింటి నడుమ నిర్వహించిన బలపరీక్షలో కేజ్రీవాల్ ఘన విజయం సాధించారు. ఆపరేషన్ కమల ఫెయిల్ అయిందని బలపరీక్ష అనంతరం కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.

Hasina in Delhi: ఢిల్లీ చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. విదేశాంగ మంత్రితో తొలి సమావేశం

జార్ఖండ్
రాజస్తాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండి ప్రభుత్వాల్ని నిలబెట్టుకోవడం సులువైంది. కానీ జార్ఖండ్ పరిస్థితి అలా కాదు. ఇక్కడ స్థానిక పార్టీ అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కలయికలో ప్రభుత్వం నడుస్తోంది. పైగా మనీ లాండరింగ్ కేసులో అనర్హత వేటుకు కాస్త దూరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. గెహ్లోత్, కేజ్రీవాల్‭లతో పోల్చుకుంటే అంత ప్రభావవంతమైన నాయకుడేం కాదు. ఒకానొక సందర్భంలో ఇక జార్ఖండ్‭లో ప్రభుత్వం పడిపోయినట్టేననే అనుమానాలు కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతటి సంక్షోభంలో ఎమ్మెల్యేలను పొరుగు రాష్ట్రం పంపి నాలుగు రోజుల పాటు అక్కడే దాచారు. సరిగ్గా బలపరీక్షకు ముందు రోజు వారిని రప్పంచి ఎట్టకేలకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు.

ఈ మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ వైపుకు వెళ్లలేదు. అంతే కాకుండా అసెంబ్లీలో వారికున్న మెజారిటీ ప్రకారం.. బలపరీక్షలో మద్దతు లభించింది. దీంతో బీజేపీ జోరు తగ్గిందనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఆపరేషన్ కమల అన్నిసార్లు పని చేయదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగానే ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ తన ఆపరేషన్ కమలను ప్రారంభించి బొక్కబోర్లా పడిందా అనే ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానాలు అయితే లేవు. కానీ, బీజేపీ స్పీడుకు ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బ్రేకులు వేశారని మాత్రం చెప్పక తప్పదు.

Lok Sabha elections 2024: ఢిల్లీ గద్దె మీద ఎగిరేదీ మన జెండానే.. తెలంగాణ నుంచే పోరాటం షురూ: సీఎం కేసీఆర్