K Kavitha: కవితక్క పోల్ స్ట్రాటజీ.. సింహం గుర్తుపై ఫోకస్..!
కవితకు కూడా ఆ పార్టీ సింబల్ కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు..ఓ సింగరేణి కార్మిక సంఘ నాయకుడి మధ్యవర్తిత్వంతో కవితతో భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.
K Kavitha: జాగృతి జనం బాటతో ప్రజల్లోకి వెళ్తున్నా ఎమ్మెల్సీ కవిత వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాజకీయాల్లో కీరోల్ పోషించేలా సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సొంత కుంపటి కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న కవిత..వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. వచ్చే ఏడాది మార్చి లేకపోతే ఏప్రిల్లో కవిత పార్టీ పెడుతారని..ఇప్పుడున్న తెలంగాణ జాగృతినే పార్టీగా మారుస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే వచ్చే ఏప్రిల్లో తాను పార్టీ రిజిస్టర్ చేసి..ఎన్నికల గుర్తు వచ్చేలోపు చాలా ఎన్నికలు వస్తాయని లెక్కలు వేసుకుంటోందట కవిత. ఖైరతాబాద్ బైపోల్ రావొచ్చని అంచనా వేస్తున్నారట. అలాగే లోకల్ బాడీ పోల్స్..గ్రేటర్ ఎన్నికలు కూడా జరిగే అవకశాలున్నాయి. దీంతో ఈ అన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని కవిత భావిస్తున్నారట.
అయితే జాగృతి ఇంకా పార్టీగా ఆవిర్భవించకపోవడంతో పాటు పార్టీ గుర్తు కూడా లేకపోవడంతో ఆల్టర్నేట్ ఆప్షన్స్ మీద ఫోకస్ పెట్టారట కవిత. భవిష్యత్ జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తుపై తన అభ్యర్థులను బరిలోకి దింపాలని చూస్తున్నారట కవిత.
Also Read: జూబ్లీహిల్స్‌లో కీలకంగా ఆ ఓటర్లు.. బైపోల్‌లో టీడీపీ సానుభూతిపరులు ఎవరికి జై కొడతారు?
ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ పార్టీ.. రాష్ట్రంలో రెబల్స్కు కేరాఫ్ గా ఉంటుంది. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్ దక్కని నేతలు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేసి..టికెట్ ఇవ్వని పార్టీలకు సవాల్ చేస్తుంటారు. భారీగా ఓట్లు చీల్చి తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తుంటారు. గత ఎన్నికల్లో రామగుండం బీఆర్ఎస్ రెబల్గా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింహం గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు.
ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థుల సత్తా
లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు సత్తా చాటారు. నేతాజి సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీతో పురుడు పోసుకున్న పార్టీ కావడం..ఆ పార్టీ సింబల్ సింహం గుర్తు కావడంతో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు నేతలు. ఇప్పుడు బీఆర్ఎస్ టార్గెట్గా జనాల్లోకి వెళ్తున్న కవితకు సింహం తోడైతే రాజకీయాల్లో గర్జించడం ఇంకా ఈజీ అవుతుందని లెక్కలు వేస్తున్నారట జ్యోతిష్యులు.
రెబల్స్ కు కేరాఫ్‌గా ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కవిత లాంటి కరిజ్మా లీడర్ తోడైతే ఆ పార్టీకి జన బలం పెరిగే ఛాన్స్ ఉండగా..కవితకు కూడా ఆ పార్టీ సింబల్ కలిసి వస్తుందని భావిస్తున్నారట. అయితే సెంటిమెంట్, జాతకాలను విశ్వసించే కవితకు…సింహం గుర్తు పొలిటికల్ గా కలిసి వస్తుందని జ్యోతిష్యులు, పండితులు కూడా చెప్పారట.
అందుకే సింహం సింబల్ తో ప్రచారం సాగించాలనుకుంటున్నారట. ఇప్పటికే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు..ఓ సింగరేణి కార్మిక సంఘ నాయకుడి మధ్యవర్తిత్వంతో కవితతో భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. కవితకు మెజారిటీ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుండగా చర్చలు మాత్రం ఓ కొలిక్కి రాలేదట. అన్నీ అనుకున్నట్లు జరిగితే రానున్న స్థానిక ఎన్నికలే కవితకు తొలి టార్గెట్ అవడం ఖాయం.
