Nara Lokesh: ఎవరినీ వదలను, ఫలితం అనుభవిస్తారు- సోషల్ మీడియాలో పోస్టులపై మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్..

చట్టాలు ఉల్లంఘించిన వారిని శిక్షించే విషయంలో కుల, మత, ప్రాంతాలు, పార్టీలు చూడమని తేల్చి చెప్పారు.

Nara Lokesh: ఎవరినీ వదలను, ఫలితం అనుభవిస్తారు- సోషల్ మీడియాలో పోస్టులపై మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Updated On : November 3, 2025 / 9:03 PM IST

Nara Lokesh: మీడియాతో చిట్ చాట్ లో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటన అంటూ బయలుదేరుతున్న జగన్ ఎవరినీ చంపకుండా ఉంటే చాలు అని కామెంట్ చేశారు. మద్యంలో డబ్బులు తీసుకోవట్లేదని నేను ప్రమాణం చేసేందుకు సిద్ధం అన్నారు లోకేశ్. మద్యం కుంభకోణంలో డబ్బులు తీసుకోలేదని జగన్ తన పిల్లలపై ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో జగన్ చర్చకు రాకుండా బయట ఈ డ్రామాలేంటి? అని మండిపడ్డారు. చట్టాలు ఉల్లంఘించిన వారిని శిక్షించే విషయంలో కుల, మత, ప్రాంతాలు, పార్టీలు చూడమని తేల్చి చెప్పారు.

కల్తీ మద్యంపై దాడులు చేసింది కూటమి ప్రభుత్వం, పట్టుకుంది తెలుగుదేశం ముసుగులో ఉన్న నాయకులను అని చెప్పారు. జగన్ బీసీల వ్యతిరేకి కాబట్టే ఆయన పార్టీకి 11సీట్లు వచ్చాయన్నారు. బీసీ యువకుడైన చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం రాకుండా అడ్డు పడింది వైసీపీ కాదా? అని మంత్రి లోకేశ్ నిలదీశారు. వైసీపీ కీలక నేత జోగి రమేశ్ అరెస్ట్ వ్యవహారంపైనా లోకేశ్ స్పందించారు. అన్ని ఆధారాలతో అడ్డంగా దొరికారు కాబట్టే జోగి రమేష్ అరెస్ట్ అయ్యారని స్పష్టం చేశారు.

ఇక, సోషల్ మీడియాలో పోస్టుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు లోకేశ్. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు ఉండబోతున్నాయని ఆయన హెచ్చరించారు. ఇష్టానుసారం పోస్టులు పెట్టే వారు ఫలితం అనుభవించి తీరుతారని వార్నింగ్ ఇచ్చారు. అసత్యాలు పోస్ట్ చేసే ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు. నేను అనని మాటలు అన్నట్లుగా వక్రీకరించిన ఓ పత్రిక దాని అనుబంధ మీడియా సంస్థలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. భారతిరెడ్డిపై అసభ్య పోస్టు పెట్టిన తెలుగుదేశం కార్యకర్తను సైతం అరెస్ట్ చేశామని ఆయన గుర్తు చేశారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కొనే విషయంలో మంత్రులంతా టీమ్ వర్క్ గా పని చేశామన్నారు లోకేశ్.

Also Read: గ్రూప్‌వార్‌కు చెక్‌.. కర్నూల్‌ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె ఫైనలా..?