YSRCP: గ్రూప్‌వార్‌కు చెక్.. కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆమె ఫైనలా..?
గతంలో ఎమ్మిగనూరు ఇంచార్జ్‌గా బుట్టా రేణుకను ప్రకటించిన జగన్, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించినా..బుట్టా రేణుక ఆచరణలో పెట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
YSRCP: ఎన్నికలకు ఇంకా మూడున్నేళ్ల టైమ్ ఉండగానే..ఒక్కో నియోజకవర్గంలో పరిస్థితులను సెట్‌రైట్ చేస్తూ వస్తోంది వైసీపీ అధిష్టానం. గ్రూప్‌వార్ ఉన్న సెగ్మెంట్లలో ఒక్కో నేతను మెల్లిగా సైడ్ చేస్తోంది. ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న బుట్టా రేణుకను తప్పించి..మాజీ ఎమ్మెల్యే చెన్నకేశివరెడ్డి వర్గానికి లైన్ క్లియర్ చేసింది. సేమ్‌టైమ్ బుట్టా రేణుకను కర్నూల్ ఎంపీ అభ్యర్ధిగా కన్ఫామ్ చేసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కర్నూల్ వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్‌గా బుట్టా రేణుకాను నియమించింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం. బుట్టా రేణుక 2014లో కర్నూల్ నుంచి ఎంపీగా గెలిచారు. 2018 టైమ్‌లో ఆమె వైసీపీని వీడారు. తిరిగి 2019 ఎన్నికల ముందు పార్టీలో చేరినా ఆమెకు టికెట్ ఇవ్వలేదు. 2024లో ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆమె నిన్నటిదాకా ఎమ్మిగనూరు ఇంచార్జ్‌గా పనిచేస్తూ వచ్చారు. (YSRCP)
అయితే ఎమ్మిగనూరులో గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి వర్గం ఒకవైపు..మరోవైపు బుట్టా రేణుక వర్గం ఉంటూ పార్టీని రెండుగా విభజించారన్న పార్టీ రోడ్డున పడిందని అధిష్టానంకు రిపోర్టులు అందాయట. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా రెండుగా చీలిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో..బుట్టా రేణుకను పార్లమెంట్‌కి పంపించి చెన్నకేశవరెడ్డి వర్గానికి ఊరట కలిగించారని అంటున్నారు. చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్‌రెడ్డికే ఎమ్మిగనూరు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో వ్యవహారం సెట్ అయినట్లేనని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట.
Also Read: ఆ దేశంపై యుద్ధానికి అమెరికా రెడీ? ట్రంప్ కీలక కామెంట్స్.. యూఎస్‌కు రష్యా వార్నింగ్
బుట్టా రేణుక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని అనుకుంటున్నారన్నది ప్రచారంలో ఉంది. పైగా ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగాలని భావిస్తున్నారట. ఇప్పుడు ఎమ్మిగనూరు పంచాయితీకి ఎండ్‌కార్డ్ వేసేందుకు వైసీపీ అధినేత ఆమెను కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. అయితే మళ్లీ ఎంపీగా పంపిస్తుండటంతో బుట్టా రేణుకా ఎలా రియాక్ట్ అవుతారన్నదే హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు చూస్తే ఈ సీటు నుంచి 2024లో కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బీవై రామయ్యకు ఎక్కడ అవకాశమిస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. వైసీపీకి ఎంతో పట్టున్న కర్నూల్ జిల్లాలో రాజకీయం వర్గపోరుకు కేరాఫ్‌గా మారడం అయితే ఒకింత కలవరం రేపుతోంది. ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జి బుట్టా రేణుక తొలగింపుతో నియోజకవర్గంలో ముసలం మొదలైందట.
బుట్టా అనుచరులంతా తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్నారట. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు ఎర్రకోట రాజీవ్ రెడ్డిని నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమిస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎర్రకోట రాజీవ్ రెడ్డిని నియోజకవర్గ ఇంచార్జ్‌గా పెట్టడంపై వైసీపీలోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉందట. దీంతో భవిష్యత్ కార్యాచరణపై బుట్టా వర్గం దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.
రేణుక సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో..
వయసు రీత్యా గత ఎన్నికల్లో ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి వైసీపీ ఎమ్మిగనూరు టికెట్ ఇవ్వలేదు. తన కొడుకు జగన్ మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అడిగినా గతంలో ఓడిపోవడంతో అధిష్టానం నిరాకరించింది. బుట్టా రేణుక సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో ఎమ్మిగనూరు నుంచి ఆమెను బరిలోకి దించింది వైసీపీ అధిష్టానం. అయితే గ్రూపు తగాదాలతోనే తమ నాయకురాలు ఓడిపోయినట్లు బుట్టా రేణుక వర్గం అప్పట్లో గుసగుసలాడింది.
అయితే నియోజకవర్గ ఇంచార్జ్ పదవి కోసం పార్టీలో కొంతకాలంగా గట్టి పోటీ నెలకొన్నప్పటికీ, అధిష్టానం మాత్రం రాజీవ్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. దీంతో సీనియర్ నేత ఎర్రకోట కేశవరెడ్డి పంతం నెగ్గిందన్న టాక్ వినిపిస్తోంది. రాజీవ్ రెడ్డి నియామకం ద్వారా యువతను ఆకట్టుకోవడంతో పాటు, రెడ్డి సామాజిక వర్గంలో పట్టును పెంచుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఎమ్మిగనూరు ఇంచార్జ్‌గా బుట్టా రేణుకను ప్రకటించిన జగన్, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించినా..బుట్టా రేణుక ఆచరణలో పెట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట క్యాడర్‌కు బుట్టా రేణుకా విలువ ఇవ్వలేదని కేశవరెడ్డి దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మొత్తం పట్టున్న కేశవరెడ్డి జగన్ దగ్గరికి వెళ్లి తమకు న్యాయం చేయాలని పట్టుపట్టడంతో బుట్టా రేణుకను తొలగించి తన మనవడు రాజీవ్ రెడ్డికి పగ్గాలు అప్పగించారట వైసీపీ అధినేత.
అయితే ఎన్నికల సమయం నుంచి బుట్టా రేణుక నియోజకవర్గంలో బీసీ మహిళగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా నియోజకవర్గ ఇంచార్జ్‌గా రాజీవ్ రెడ్డిని ప్రకటించడంతో కొంతమంది వైసీపీ కీలక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కనీసం రాజకీయ అనుభవం లేని చిన్న వయసున్న రాజీవ్ రెడ్డికు ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తే ఆయన కింద తామేలా పని చేయాలని నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కానీ, బుట్టా రేణుకకు గాని బాధ్యతలు ఇస్తే పనిచేస్తామని..లేకపోతే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
