Amit Shah vs Thackeray: ఉద్ధవ్ థాకరేకి గుణపాఠం చెప్పాల్సిందే.. MVA ప్రభుత్వం కూలిన 2 నెలల తర్వాత తీవ్ర కంఠంతో గర్జించిన అమిత్ షా

మరికొద్ది రోజుల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. షా ఇప్పటి నుంచే పార్టీకి దిశానిర్దేశం ప్రారంభించారు. 150 స్థానాలు లక్ష్యంగా (మిషన్ 150) పని చేయాలని, ఫలితాలు సాధించాలని రాష్ట్ర పార్టీ విభాగానికి సూచించారు. ప్రజలు మోదీ నాయకత్వంలోని బీజేపీ వెంట ఉన్నారని ద్రోహులైన థాకరేల వెంట లేరని అమిత్ షా స్పష్టం చేశారు.

Amit Shah vs Thackeray: ఉద్ధవ్ థాకరేకి గుణపాఠం చెప్పాల్సిందే.. MVA ప్రభుత్వం కూలిన 2 నెలల తర్వాత తీవ్ర కంఠంతో గర్జించిన అమిత్ షా

AmitShah on Economy

Amit Shah vs Thackeray: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయి బీజేపీ-శివసేన (షిండే) నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల అనంతరం బీజేపీ స్ట్రాటజిస్టు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదటిసారి ఉద్ధవ్ థాకరే గురించి మాట్లాడారు. మాట్లాడటమంటే మామూలుగా మాట్లాడలేదు. థాకరేకి గుణపాఠం చెప్పాలంటూ తీవ్ర కంఠంతో గర్జించారు. ఉద్ధవ్ చేసిన ద్రోహానికి అది తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని కోల్పోయి, పార్టీ చీలిపోయి ఉన్న థాకరేకి అమిత్ షా చెప్పాలనుకుంటున్న గుణపాఠమేంటనేది ప్రస్తతానికైతే స్పష్టత లేదు. సోమవారం ముంబైలో నిర్వహించిన మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్ అగాఢీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందనే విషయం ఎవరికీ తెలియనిది కాదు. ఇందుకు శివసేన నిలువునా చీలడంలో కూడా వీరి సహకారం బాగానే ఉందనే విమర్శలు బలంగానే ఉన్నాయి. అయితే అమిత్ షా మాత్రం శివసేన చీలికకు ఉద్ధవ్ వ్యవహారశైలేనని తాజాగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లేచిన అతిపెద్ద రాజకీయ దుమారానికి థాకరేనే బాధ్యత వహించాలని అన్నారు. రాజకీయాల్లో ఏదైనా భరిస్తామని, అయితే నమ్మకద్రోహాన్ని మాత్రం ఎంత మాత్రం సహించేది లేదని అమిత్ షా అన్నారు.

Hemant Soren: ఝార్ఖండ్ రాజకీయ అనిశ్చితికి తెర.. విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ సర్కారు

ఉద్ధవ్ కేవలం బీజేపీకి మాత్రమే ద్రోహం చేయలేదని, భావజాలానికి ప్రజల తీర్పుకు కూడా ద్రోహం చేశారని అన్నారు (2019 నాటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీ చేశాయి. అనంతరం బీజీపీతో విడిపోయి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది). ఉద్ధవ్‭కు అధికార దాహం ఎక్కువైందని, అదే ప్రస్తుతం ఆయనను నిండా ముంచిందని షా విమర్శించారు. ‘‘ఈరోజు నేను మళ్లీ గుర్తు చేస్తున్నా. ఉద్ధవ్ థాకరేకు ముఖ్యమంత్రి పదవి హామీ ఇవ్వలేదు. మేము తలుపులు మూసి ఏదీ మాట్లాడము. అన్నీ బహిరంగంగానే ఉంటాయి. అలాగే రాజకీయాల్లో దేన్నైనా భరిస్తాం కానీ, నమ్మకద్రోహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భరించబోం’’ అని అమిత్ షా అన్నారు.

మరికొద్ది రోజుల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. షా ఇప్పటి నుంచే పార్టీకి దిశానిర్దేశం ప్రారంభించారు. 150 స్థానాలు లక్ష్యంగా (మిషన్ 150) పని చేయాలని, ఫలితాలు సాధించాలని రాష్ట్ర పార్టీ విభాగానికి సూచించారు. అయితే ఇది బీజేపీ-శివసేన (షిండే) కూటమి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు మోదీ నాయకత్వంలోని బీజేపీ వెంట ఉన్నారని ద్రోహులైన థాకరేల వెంట లేరని అమిత్ షా అన్నారు.

Bengaluru Drinking Water: 2 రోజులు తాగు నీరు కట్.. అధిక వర్షాలకు తోడు కొత్త కష్టాలు