Hemant Soren: ఝార్ఖండ్ రాజకీయ అనిశ్చితికి తెర.. విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ సర్కారు

ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జేఎమ్ఎమ్ కూటమి విజయం సాధించింది. సోమవారం మధ్యాహ్నం ఈ విశ్వాస పరీక్ష జరిగింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో హేమంత్ సర్కారుకు అనుకూలంగా 48 ఓట్లు పోలయ్యాయి.

Hemant Soren: ఝార్ఖండ్ రాజకీయ అనిశ్చితికి తెర.. విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ సర్కారు

Hemant Soren: ఝార్ఖండ్‌లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ఝార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ సర్కారు విజయం సాధించింది. సీఎం హేమంత్ సోరెన్ అసెంబ్లీలో తన బలం నిరూపించుకునేందుకు సోమవారం ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేశారు.

Viral video: భయానక వీడియో.. కిందికి జారిపడ్డ జెయింట్ స్వింగ్.. 16 మందికి గాయాలు

ఈ సందర్భంగా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఏర్పాటు చేయాల్సిందిగా హేమంత్ సోరెన్ కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం చర్చ తర్వాత విశ్వాస పరీక్ష జరిగింది. 81 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు పోలయ్యాయి. ప్రతిపక్షమైన బీజేపీ, ఏజేఎస్‌యూ పార్టీలు విశ్వాస పరీక్షను బహిష్కరించాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి.

Tamil Nadu: పొదల్లో శిశువు మృతదేహం.. స్కూల్లోనే ప్రసవించి, వదిలేసిన బాలిక

బీజేపీ కుట్రలతో ప్రభుత్వం కూలిపోతుందేమోనన్న అనుమానంతో హేమంత్ సోరెన్.. తన పార్టీతోపాటు అధికారంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని రాయ్‌పూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా తన ఎమ్మెల్యేలతో రాంచీ తిరిగొచ్చిన హేమంత్ సోరెన్.. విశ్వాస పరీక్ష ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించారు.