Viral video: భయానక వీడియో.. కిందికి జారిపడ్డ జెయింట్ స్వింగ్.. 16 మందికి గాయాలు

మొహాలీలో ఒక జెయింట్ స్వింగ్ కిందికి జారిపడిపోయిన ఘటనలో 16 మంది మహిళలకు గాయాలయ్యాయి. మరికొందరు చిన్నారులు కూడా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral video: భయానక వీడియో.. కిందికి జారిపడ్డ జెయింట్ స్వింగ్.. 16 మందికి గాయాలు

Viral video: పంజాబ్‌లోని మొహాలీలో జెయింట్ స్వింగ్ (స్పిన్నింగ్ జాయ్ రైడ్) కిందికి పడిపోయిన ఘటనలో 16 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. మొహాలీ, ఫేజ్-8 ప్రాంతంలోని ఒక దసరా గ్రౌండ్‌లో జెయింట్ స్వింగ్ (హై-రైజ్ స్పిన్నింగ్ జాయ్ రైడ్) ఏర్పాటు చేశారు.

Nitish Kumar: బీజేపీ సీట్ల గురించి నేనెప్పుడు మాట్లాడాను.. మాట మార్చిన నితీష్

ఆదివారం రాత్రి కొందరు ఆ జెయింట్ స్వింగ్ పైకెక్కి 40 అడుగుల పైకి వెళ్లి తిరుగుతుండగా, ఉన్నట్లుండి కిందికి పడిపోయింది. ఈ ఘటనలో అందులో ఉన్న వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. 16 మంది మహిళలతోపాటు, మరికొందరు చిన్నారులు కూడా గాయాలపాలైనట్లు సమాచారం. వెంటనే క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు జెయింట్ స్వింగ్‌లో 50 మంది వరకు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

BiggBoss 6 : ఇక మొదలెడదామా.. ఈ సారి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఏకంగా 21 మంది..

కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్ని అక్కడి వాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అమ్యూజ్‌మెంట్ పార్కుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గుజరాత్‌లో జరిగిన జెయింట్ వీల్ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.