Nitish Kumar: బీజేపీ సీట్ల గురించి నేనెప్పుడు మాట్లాడాను.. మాట మార్చిన నితీష్

బీజేపీకి 50 సీట్లే వస్తాయని వ్యాఖ్యానించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ బీజేపీ సీట్ల సంఖ్య గురించి మాట్లాడలేదన్నారు. దీంతో 24 గంటలు కూడా గడవక ముందే మాట మార్చిన నితీష్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Nitish Kumar: బీజేపీ సీట్ల గురించి నేనెప్పుడు మాట్లాడాను.. మాట మార్చిన నితీష్

Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీపై తాను చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. బీజేపీకి 50 సీట్లే వస్తాయని తాను వ్యాఖ్యానించలేదని చెప్పారు. ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే నితీష్ మాట మార్చడం విశేషం.

BiggBoss 6 : ఇక మొదలెడదామా.. ఈ సారి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఏకంగా 21 మంది..

నితీష్ కుమార్ పార్టీ.. జేడీయూ జాతీయ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో జరిగే ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లే గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. బిహార్ రాష్ట్ర బీజేపీ విభాగం… జేడీయూపై విరుచుకుపడింది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక కార్యక్రమానికి హాజరైన నితీష్ కుమార్‌ను మీడియా ఇదే అంశంపై ప్రశ్నించింది. దీంతో ఆయన సమాధానం ఇచ్చారు. తాను బీజేపీకి 50 సీట్లే వస్తాయని ఎప్పుడూ వ్యాఖ్యానించలేదన్నారు. తాను అసలు బీజేపీ నెంబర్ల గురించి చెప్పనే లేదన్నారు.

UK PM Results 2022: బ్రిటన్ ప్రధాని ఎవరు? మరికొద్ది గంటల్లో తేలనున్న ఫలితం.. రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు..

ప్రతిపక్షాలను ఏకం చేయడం మీదే దృష్టి పెట్టినట్లు చెప్పారు. ‘‘ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావాలన్నదే నా ఆశయం. అప్పుడే విజయం సాధించగలం. అంతేకానీ, నెంబర్ల గురించి నేనెప్పుడూ మాట్లాడను’’ అని నితీష్ వ్యాఖ్యానించారు. మరోవైపు నితీష్ నేరుగా ఈ సమాధానం చెప్పడానికి ముందు రోజు ఆయన పార్టీ నుంచి విడుదలైన అధికారిక ప్రెస్‌నోట్‌లో కూడా బీజేపీ 50 సీట్లే గెలుస్తుందని ప్రస్తావించడం గమనార్హం.