UK PM Results 2022: బ్రిటన్ ప్రధాని ఎవరు? మరికొద్ది గంటల్లో తేలనున్న ఫలితం.. రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు..

బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి రుషి సునాక్, లిజ్ ట్రస్‌ల మధ్య కొద్దిరోజులుగా హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరుకు నేడు తెరపడనుంది. సోమవారం బ్రిటన్ ప్రధాని ఎన్నికకు సంబంధించి తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే పలు సర్వేల ప్రకారం.. లిజ్ ట్రస్ విజేతగా నిలుస్తుందని తెలిపాయి.

UK PM Results 2022: బ్రిటన్ ప్రధాని ఎవరు? మరికొద్ది గంటల్లో తేలనున్న ఫలితం.. రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు..

UK PM Results

UK PM Results 2022: బోరిస్ జాన్సన్ వారసులుగా బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టబోయేది ఎవరో అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. బ్రిటన్ కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నసర్ గ్రాహం బ్రాడీ వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలకోసం భారత్ ప్రజలుసైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. బ్రిటన్ ప్రధాని రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచింది భారత్ సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్. 42ఏళ్ల రిషి సునాక్ 47ఏళ్ల మంత్రి లిజ్ ట్రస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు.

UK PM Race: బ్రిటన్‌ ప్రధాని రేసులో దూసుకుపోతున్న భారత సంతతి నేత రిషికి ఎదురుదెబ్బ

ఇరువురి మధ్య సాగుతున్న ఎన్నికలపోరులో లిజ్ ట్రస్ వైపే కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది మద్దతుగా ఉన్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. లిజ్ ట్రస్ ప్రధానిగా ఎన్నికైతే బిట్రన్ ప్రధానిగా మార్గరెట్ థాచర్, థెరిసా‌మే తర్వాత మూడో మహిళ కానున్నారు. ఆన్‌లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.60లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటువేసి పార్టీ నేతను ఎన్నుకుంటారు.

UK PM candidate Rishi Sunak: అసవరమైతే ఓడిపోతా.. కానీ తప్పుడు వాగ్దానాలు చేయను

మరికొద్దిసేపట్లో వెలువడే తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వేలు చెబుతున్నట్లు ఒకవేళ తాను ఈ పోటీలో ఓడిపోతే తదుపరి ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ ఉత్తర యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్పగా భావిస్తున్నానని, లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోతే ఎంపీగా కొనసాగుతూ తన నియోజకవర్గ కోసం పనిచేస్తానని అన్నారు.