గుజరాత్ ప్రజలపై రాహుల్ వరాల జల్లు.. విద్య ఫ్రీ, విద్యుత్ ఫ్రీ, ₹3 లక్షల మాఫీ, ₹4 లక్షల సాయం, 10 లక్షల ఉద్యోగాలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొవిడ్ వల్ల మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం అందిస్తాం. అలాగే రాష్ట్రంలోని ప్రజలందరికీ 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు నెలకొల్పి బాలికలకు ఉచిత విద్య అందిస్తాం. కానీ రాష్ట్రంలో బీజేపీ వేలాది పాఠశాలలను మూసివేసింది. పాలపై 5 రూపాయల సబ్సిడీ అందిస్తాం

గుజరాత్ ప్రజలపై రాహుల్ వరాల జల్లు.. విద్య ఫ్రీ, విద్యుత్ ఫ్రీ, ₹3 లక్షల మాఫీ, ₹4 లక్షల సాయం, 10 లక్షల ఉద్యోగాలు

Rahul gandhi poured promises to gujarat people ahead of assembly elections

రైతులకు 3 లక్షల రూపాయల మాఫీ, కొవిడ్ వల్ల చనిపోయిన కుటుంబాలకు 4 లక్షల రూపాయలు పరిహారం, బాలికలందరికీ ఉచిత ఇంగ్లీషు మీడియం విద్య, 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఉద్యోగాలు.. ఇవన్నీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ చేసిన వాగ్దానాలు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చారు రాహుల్. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రజలకు వాగ్దానాల మీద వాగ్దానాలు చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీపై రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‭లో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘సర్దార్ పటేల్ రైతు పక్షపాతి. అలాంటి ఆయనకు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని కట్టిన బీజేపీ.. అన్నీ రైతు వ్యతిరేక కార్యక్రమాలే చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మూడు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేస్తాం. అలాగే రాష్ట్రం డ్రగ్స్‭కు కేంద్ర బిందువుగా మారింది. ముంద్ర పోర్టు నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇదే నయా గుజరాత్ మోడల్. నిరసన చేయాలంటే అనుమతి తీసుకోవాల్సిన ఏకైక రాష్ట్రం గుజరాత్. విచిత్రం ఏంటంటే.. ఎవరిపై నిరసన చేస్తున్నారో వారి అనుమతే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని రాహుల్ అన్నారు.

Hemant Soren: ఝార్ఖండ్ రాజకీయ అనిశ్చితికి తెర.. విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ సర్కారు

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొవిడ్ వల్ల మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం అందిస్తాం. అలాగే రాష్ట్రంలోని ప్రజలందరికీ 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు నెలకొల్పి బాలికలకు ఉచిత విద్య అందిస్తాం. కానీ రాష్ట్రంలో బీజేపీ వేలాది పాఠశాలలను మూసివేసింది’’ అని హామీలు ఇచ్చారు.

‘‘పాలపై 5 రూపాయల సబ్సిడీ అందిస్తాం. మోదీ ప్రభుత్వం వంట గ్యాప్ మీద పన్నుల భారం మోపి సిలిండర్ 1,000 రూపాయలు చేసింది. మేం అధికారంలోకి రాగానే 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ ఇస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తరిమేయాలని అని నేను అనుకుంటున్నాను. గుజరాత్ యువతకు 10 లక్షల ఉద్యోగాలపై మేం దృష్టి సారించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే ఇవన్నీ అందిస్తామని నేను హామీ ఇస్తున్నాను’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Bharat Jodo Yatra: ‘భారత్ జోడో యాత్ర’.. ‘మన్ కీ బాత్’ లాంటిది కాదు: కాంగ్రెస్