Bharat Jodo Yatra: ‘భారత్ జోడో యాత్ర’.. ‘మన్ కీ బాత్’ లాంటిది కాదు: కాంగ్రెస్

‘భారత్ జోడో యాత్ర’ వచ్చే బుధవారం నుంచే ప్రారంభం కానుంది. ఆ రోజు భారీ సభ, ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం గురువారం ఉదయం ఏడు గంటలకు యాత్ర మొదలవుతుంది. ఈ కార్యక్రమం మోదీ చేపట్టిన ‘మన్ కీ బాత్’ లాంటిది కాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

Bharat Jodo Yatra: ‘భారత్ జోడో యాత్ర’.. ‘మన్ కీ బాత్’ లాంటిది కాదు: కాంగ్రెస్

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతున్న ‘భారత్ జోడో యాత్ర’ బుధవారం (సెప్టెంబర్ 7) నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర సాగుతుంది.

Viral video: జిమ్‌లో వర్కవుట్ చేస్తూ తలకిందులైన మహిళ.. స్మార్ట్‌వాచ్‌తో ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్.. వీడియో వైరల్

ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దాదాపు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఈ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నాయి. స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ చేపడుతున్న అతిపెద్ద ప్రజా కార్యక్రమం ఇదే కావడం విశేషం. 2024లో జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ప్రజల్ని ఆకట్టుకునే లక్ష్యంతో కాంగ్రెస్ ఈ యాత్ర చేపడుతోంది. ఈ యాత్రకు సంబంధించిన యాంథమ్‪ను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా కార్యక్రమం గురించి వివరిస్తూ, బీజేపీ, మోదీలపై విమర్శలు చేసింది. ఇది ‘మన్ కీ బాత్’లాంటి కార్యక్రమం కాదని తెలిపింది. ‘‘భారత్ జోడో యాత్ర.. ఏ రకంగానూ ‘మన్ కీ బాత్’లాంటి కార్యక్రమం కాదు. ఇందులో పెద్దపెద్ద ప్రసంగాలు, డ్రామా, టెలీప్రాంప్టర్, బోధనలు వంటివి ఉండవు.

Tamil Nadu: పొదల్లో శిశువు మృతదేహం.. స్కూల్లోనే ప్రసవించి, వదిలేసిన బాలిక

ఇది ప్రజల గురించి చేస్తున్న యాత్ర. ప్రజల ఆవేదన, డిమాండ్లను ఢిల్లీదాకా చేర్చడమే ఈ యాత్ర ఉద్దేశం’’ అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు. ఈ యాత్ర వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 7న ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. కన్యాకుమారిలో ఒక పెద్ద ర్యాలీ, సభ నిర్వహిస్తారు. ఈ సభకు తమిళనాడు సీఎం స్టాలిన్‌తోపాటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బగేల్, ఇతర కాంగ్రెస్ కీలక నేతలు హాజరవుతారు. అనంతరం సెప్టెంబర్ 8, ఉదయం ఏడు గంటల నుంచి యాత్ర ప్రారంభమవుతుంది.