Hasina in Delhi: ఢిల్లీ చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. విదేశాంగ మంత్రితో తొలి సమావేశం

నాలుగు రోజుల భార పర్యటనలో భాగంగా ఆమె సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరమే జయశంకర్‭తో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రైపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‭దీప్ ధన్‭కడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో సమావేశం కానున్నారు. మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమై ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం, ప్రాంతీయ సుస్థిరత, పెండింగ్‭లో ఉన్న సాధారణ ద్వైపాక్షిక సమస్యలు, తదితర అంశాలపై చర్చించనున్నారు.

Hasina in Delhi: ఢిల్లీ చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. విదేశాంగ మంత్రితో తొలి సమావేశం

S Jaishankar calls on Bangladesh PM Sheikh Hasina in Delhi

Hasina in Delhi: బంగాదేళ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో భారత విదేశంగ మంత్రి ఎస్.జయశంకర్ సమావేశమాయ్యారు. నాలుగు రోజుల భార పర్యటనలో భాగంగా ఆమె సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరమే జయశంకర్‭తో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రైపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‭దీప్ ధన్‭కడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో సమావేశం కానున్నారు. మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమై ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం, ప్రాంతీయ సుస్థిరత, పెండింగ్‭లో ఉన్న సాధారణ ద్వైపాక్షిక సమస్యలు, తదితర అంశాలపై చర్చించనున్నారు.

బంగ్లాకు ఇండియా ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఆ దేశంలో పలు ప్రాజెక్టులు చేపడుతోంది. మన దేశంలో చదువుకోవడానికి వచ్చే 9,000 మంది బంగ్లాదేశీయులకు మన ప్రభుత్వం స్కాలర్‌షిప్ కూడా అందిస్తోంది. కాగా, షేక్ హసీనా పర్యటనపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ‘‘బంగ్లా ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరింతగా, బహుముఖంగా బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాల్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది’’ అని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఈసారి పర్యటనలో భారత ప్రభుత్వంతో రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, నదీ జలాల పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కుషియారా నది జలాల వాటాపై ఒప్పందం కుదుర్చుకుంటారు. అలాగే ఇతర నదుల్లో జలాల పంపిణీపై కూడా ఒప్పందాలు జరుగుతాయి. ఇండియా-బంగ్లాదేశ్.. 54 నదుల్ని పంచుకుంటున్నాయి. అకౌరా-అగర్తాలా రైల్ లింక్‌ను తిరిగి ప్రారంభించే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాను షేక్ హసీనా గురువారం సందర్శిస్తారు. ఇక బంగ్లాదేశ్ అభివృద్ధికి భారత్ ఎంతగానో సహకరిస్తోంది. 2019 తర్వాత షేక్ హసీనా ఇండియాలో పర్యటించడం ఇదే మొదటిసారి.

Amit Shah vs Thackeray: ఉద్ధవ్ థాకరేకి గుణపాఠం చెప్పాల్సిందే.. MVA ప్రభుత్వం కూలిన 2 నెలల తర్వాత తీవ్ర కంఠంతో గర్జించిన అమిత్ షా