Rashmika Mandanna: పబ్లిక్ గా పేరు చెప్తే చంపేస్తారు.. చాలా మంది ఉన్నారు.. ఆయనకు మాత్రమే సాధ్యం..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ "ది గర్ల్ ఫ్రెండ్". (Rashmika Mandanna)దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నాడు.

Rashmika Mandanna: పబ్లిక్ గా పేరు చెప్తే చంపేస్తారు.. చాలా మంది ఉన్నారు.. ఆయనకు మాత్రమే సాధ్యం..

Rashmika Mandanna makes interesting comments about Mahesh Babu

Updated On : November 3, 2025 / 9:09 PM IST

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నాడు. మరో హీరోయిన్ అను ఇమాన్యుయెల్ కీ రోల్ చేస్తోంది. (Rashmika Mandanna)ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేయగా ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మీడియాతో ముచ్చటించ్చింది రష్మిక.

Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఫోటోలు.. ఎంత క్యూట్ గా ఉందో చూశారా..

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చాలా ఆసక్తికర విషయాలు పంచుకుంది.. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నాకు చాలా నచ్చిన సినిమా. సినిమా విషయంలో నేను ఏది ఫీలయ్యానో ఆడియన్స్ కూడా అదే ఫీలవుతారు. యూత్ తప్పకుండ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా తరువాత రెండు మూడు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న. డైరెక్ట్ తమిళ సినిమా చేయడానికి కాస్త సమయం పడుతుంది. నాకు చాలా మంది బెస్టీస్ ఉన్నారు. వారిలో ఒకరి పేరు పబ్లిక్ గా చెప్తే నన్ను చంపేస్తారు. మహేష్ బాబు గారి వయసు ఎప్పటికి అలసిపోవడం లేదు. రాను రాను ఇంకా యంగ్ గా అవుతున్నారు. అదెలా సాధ్యం అవుతుందో అర్థం కావడంలేదు” అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రష్మిక మందన్నా తరువాతి సినిమాల విషయానికి వస్తే, ఆమె రీసెంట్ గా మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అదే మైసా. రవీంద్ర పిల్లీ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గోండు బిడ్డగా కనిపించనుంది. నవంబర్ 3వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. చాలా పవర్ ఫుల్ గా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.