Viral Video: వావ్… వరల్డ్ కప్ మ్యాచ్ విన్నింగ్ వీడియో తర్వాత ఇదే హైలైట్.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది..

ఇంగ్లీష్ లో ఆ చిన్నారి చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పాప మాటలకు అందరూ ఫిదా అవుతున్నారు.

Viral Video: వావ్… వరల్డ్ కప్ మ్యాచ్ విన్నింగ్ వీడియో తర్వాత ఇదే హైలైట్.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది..

Updated On : November 3, 2025 / 7:39 PM IST

Viral Video: భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచింది. ఫైనల్ లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియా.. టైటిల్ ను కైవసం చేసుకుంది. తుది పోరులో మన అమ్మాయిలు అదరగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో మన అమ్మాయిలు దుమ్మురేపారు. అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి జగజ్జేతలుగా నిలిచారు.

47 ఏళ్ల మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో.. భారత్ వరల్డ్ కప్ గెలవడం ఇదే ఫస్ట్ టైమ్. 2005, 2017 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు వెళ్లినా.. చివరి మెట్టుపై బోల్తా పడింది. 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘోరంగా ఓడిపోయింది. 2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మెగా ఫైనల్‌లో.. ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా.. ఈసారి తన కలను నెరవేర్చుకుంది.

తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడిన భారత ఉమెన్స్ టీమ్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అమ్మాయిలు మీరు అసాధ్యులు అంటూ కితాబిస్తున్నారు. మీరు దేశానికి గర్వకారణం అయ్యారంటూ పొగుడుతున్నారు. ఈ విజయం భారత క్రికెట్ ప్రస్థానంలో ఒక చారిత్రక ఘట్టమని, ఇది యుగయుగాల పాటు గుర్తుండిపోతుందని హ్యాపీ అవుతున్నారు. భారత అమ్మాయిలు అందించిన ఈ అద్భుత విజయం దేశానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

వరల్డ్ కప్ మ్యాచ్ విన్నింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ దీన్ని ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. దేశవ్యాస్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్ మ్యాచ్ విన్నింగ్ వీడియో తర్వాత మరో వీడియో హైలైట్ అయ్యింది. సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇంతకీ ఏంటా వీడియో, అందులో ఏముంది అనే వివరాల్లోకి వెళితే..

భారత మహిళా జట్టు తమ తొలి ఐసీసీ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న సందర్భంగా ఒక పాప మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. ఆ చిన్నారి భారత జట్టుకు వీరాభిమానిలా కనిపించింది. టీమిండియా విశ్వ విజేతగా నిలవడంతో ఆ పాప పుల్ హ్యాపీగా ఉంది. భారత జట్టుకు విషెస్ చెబుతూ ఆ చిన్నారి మాట్లాడిన మాటలు.. అందరినీ ఫిదా చేస్తున్నాయి. ముద్దు ముద్దుగా ఆ పాప చెప్పిన మాటలు మెస్మరైజ్ చేస్తున్నాయి.

చిన్నారి మాటలకు అందరూ ఫిదా..

“నా దగ్గర వివరించడానికి మాటలు రావడం లేదు. ఈరోజు ఆడిన ప్రతి క్రీడాకారిణి తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. క్రెడిట్ దీప్తి శర్మ, షఫాలీ వర్మలకు చెందుతుంది. వారిద్దరూ బ్యాటిఫుల్ గా ఆడారు. అందరూ చాలా బాగా సహకరించారు. చాలా కాలం వేచి ఉన్న తర్వాత మనం ఈ ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాము. ఈరోజు వారు చూపించిన ఓపిక, అంకితభావం, ప్రేమ అద్భుతమైనవి. మైదానంలో ఉన్న ప్లేయర్లు, కోచ్‌లు, మద్దతుదారులు ఇలా అందరూ.. ప్రతి మ్యాచ్‌లో అదరగొట్టారు. అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు” అంటూ ఇంగ్లీష్ లో ఆ చిన్నారి చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పాప మాటలకు అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. చిన్న పాప అయినా పెద్దోళ్లు కూడా మాట్లాడని రీతిలో, క్రీడా విశ్లేషకుల తరహాలో మాట్లాడిందని కితాబిస్తున్నారు.

 

పిట్ట కొంచెం కూత ఘనం అంటూ ఆ పాపని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడాలి అని కాకుండా.. ఎంతో అవగాహన ఉన్న దానిలా, ఓ ఎక్స్ పర్ట్ లా, స్పోర్ట్స్ అనలిస్ట్ విశ్లేషణ చేసిన రీతిలో ఆ పాప మాటలు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మొత్తంగా వరల్డ్ కప్ మ్యాచ్ విన్నింగ్ వీడియో తర్వాత ఈ పాప మాటల వీడియో ఇప్పుడు హైలైట్ అయ్యింది.

Also Read: స్మృతి మంధాన కాబోయే భర్త ఇతడే..! ఎవరీ పలాష్ ముచ్చల్, ఏం చేస్తాడు, అతడి నికర ఆస్తి ఎంతో తెలుసా..