Smriti Mandhanas Fiance: స్మృతి మంధాన కాబోయే భర్త ఇతడే..! ఎవరీ పలాష్ ముచ్చల్, ఏం చేస్తాడు, అతడి నికర ఆస్తి ఎంతో తెలుసా..
ఈ పిక్ తర్వాత పలాష్ ముచ్చల్ సైతం ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. అతడు ఎవరు, ఏం చేస్తాడు, నికర ఆస్తి విలువ ఎంత.. ఇటువంటి వివరాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
Smriti Mandhanas Fiance: మన అమ్మాయిలు దుమ్మురేపారు. సరికొత్త చరిత్ర సృష్టించారు. భారత్ ను విశ్వ విజేతగా నిలిపారు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్ ను టీమిండియా గెలుచుకుంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి తొలిసారి కప్పును ముద్దాడింది భారత్. టీమిండియా విజయాల్లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కీ రోల్ ప్లే చేసింది. కీలక మ్యాచుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి విజయాలు సాధించి పెట్టింది. ఇక ఫైనల్ మ్యాచ్ లోనూ మంధాన అదరగొట్టింది. 58 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల సాయంతో కీలకమైన 45 పరుగులు సాధించింది.
భారత జట్టులో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆమె గురించి అంతా చర్చించుకుంటున్నారు. గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫైనల్లో గెలుపు తర్వాత మంధాన ఆనందానికి అవధులు లేవు. జాతీయ గౌరవానికి ప్రతీకగా భారత జెండా చుట్టిన ప్రపంచ కప్ ట్రోఫీని గర్వంగా పట్టుకుని సెలబ్రేషన్స్ జరుపుకుంది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలోనే స్మృతి మంధాన ప్రియుడు పలాష్ ముచ్చల్ సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఓ ఫోటోను కూడా పంచుకున్నాడు. అందులో వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని అతడు స్మృతి మంధానకు ఇస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారగా.. అతడి చేతి పై ఉన్న టాటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చేతిపై ఎస్ఎం 18 అని ఉంది. ఎస్ఎం అంటే స్మృతి మంధాన అని అర్థం. ఇక 18 అంటే.. ఆమె జెర్సీ నంబర్.
ఈ పిక్ తర్వాత పలాష్ ముచ్చల్ సైతం ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. అతడు ఎవరు, ఏం చేస్తాడు, నికర ఆస్తి విలువ ఎంత.. ఇటువంటి వివరాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ పలాష్ ముచ్చల్ మరెవరో కాదు.. స్మృతి మంధాన బాయ్ ఫ్రెండ్. కాబోయే భర్త కూడా. ఇతడు బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్. 1995లో ఇండోర్‌లో జన్మించాడు పలాష్. భారతీయ శాస్త్రీయ గాయకుడు, విజయవంతమైన బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ గా గుర్తింపు పొందాడు. దిష్కియోన్ (2014), భూమి, తేరే బిన్ లాడెన్: డెడ్ ఆర్ అలైవ్ వంటి ప్రముఖ రచనలు చేశాడు. గాయకుడు పాలక్ ముచ్చల్ తమ్ముడే ఈ పలాష్ ముచ్చల్. ప్రతిభావంతులైన సంగీత జంటలలో ఒకరిగా గుర్తింపు పొందారు.
నవంబర్ 20న పెళ్లి..!
పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని వీరు 2024లో బహిరంగపరిచారు. అంతేకాదు త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకోనుందని సమాచారం. వీరి వివాహం నవంబర్ 20న స్మృతి స్వస్థలం మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగనుందని తెలుస్తోంది.
ఇక పలాష్ నికర ఆస్తి విలువ వివరాలపై ఓ లుక్ వేద్దాం. 2025 నాటికి పలాష్ నికర ఆస్తి విలువ 20 కోట్ల నుంచి 41 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. కంపోజర్ గా, ప్రొడ్యూసర్ గా చేయడం ద్వారా.. మ్యూజిక్ ప్రాజెక్ట్స్ నుండి అతడు ఈ ఆదాయం పొందాడని నివేదికలు చెబుతున్నాయి.
