Mani Ratnam: రాజమౌళి వల్లే అది స్టార్ట్ అయ్యింది.. లేదంటే కష్టమే.. నేను కూడా అలానే చేశాను..
ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో తప్పకుండ ఉండే పేరు మణిరత్నం. "పల్లవి అనుపల్లవి" అనే సినిమా నుంచి(Mani Ratnam) మొన్నొచ్చిన థగ్ లైఫ్ వరకు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారు.
Director Mani Ratnam makes shocking comments on Rajamouli and Baahubali movie
Mani Ratnam: ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో తప్పకుండ ఉండే పేరు మణిరత్నం. పల్లవి అనుపల్లవి అనే సినిమా నుంచి మొన్నొచ్చిన థగ్ లైఫ్ వరకు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారు. వాటిలో గీతాంజలి, రోజా, దళపతి లాంటి చాలా సినిమాలు ఉన్నాయి. ఆయన రీసెంట్ చిత్రం “థగ్ లైఫ్”. కమల్ హాసన్ హీరోగా పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే, తాజాగా దర్శకుడు మణిరత్నం(Mani Ratnam) దర్శకధీరుడు రాజమౌళి, ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Divya Bharathi: గ్లామర్ బ్యూటీ దివ్య భారతి.. అందం చూస్తే పోతుంది మతి..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గిన్న ఆయన మాట్లాడుతూ.. “బాహుబలి సినిమా రాకపోయుంటే నేను ఎమోషన్స్ బలంగా ఉండే కథలు చేయకపోయేవాడిని. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ చేయడానికి ప్రధాన కారణం బాహుబలి. రాజమౌళి బాహుబలి సినిమాను రెండు పార్టులుగా చేసి సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ దారిలోనే నేను కూడా పొన్నియన్ సెల్వన్ కథను రెండు భాగాలుగా తెరకెక్కించాను. గతంలో రెండు పార్టులుగా సినిమాలు చేయడం అనే సాహసం ఎవరూ చేయలేదు.
భారీ బడ్జెట్ తో సినిమాలు చేసినప్పుడు రెండు పార్టుల్లో చేయడం పెద్ద సాహసం. రాజమౌళి బాహుబలి చేయడం వల్లనే నాలాంటి వారికి ఒక నమ్మకం వచ్చింది. మనం కూడా ఇలాంటి కథలను చెప్పగలం అనే స్ఫూర్తిని అందించాడు రాజమౌళి. అందుకే, ఇప్పుడు చాలా మంది అలాంటి సినిమాలు చేస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు మణిరత్నం. దీంతో అయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
