Rahul Gandhi: చెరువులోకి దూకిన రాహుల్ గాంధీ.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Rahul Gandhi: చెరువులోకి దూకిన రాహుల్ గాంధీ.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్

Updated On : November 2, 2025 / 7:53 PM IST

Rahul Gandhi: నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అందుకు భిన్నంగా వ్యవహరించారు. కాసేపు ఆయన సరదాగా గడిపారు. ఓ చెరువులోకి దూకారు రాహుల్ గాంధీ. అంతేకాదు.. ఈత కొట్టి, చేపలు పట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

రాహుల్ గాంధీ ప్రస్తుతం బిహార్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ముమ్మరంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే, బెగుసరాయ్‌లో ఆయన రొటీన్ కు భిన్నంగా కనిపించారు. మత్స్యకారులతో సమావేశమైన రాహుల్ గాంధీ.. వారితో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత వారితో కలిసి ఓ చెరువు దగ్గరికి వెళ్లారు. పడవలో కాస్త దూరం వెళ్లారు. నీళ్లు చూడగానే ఆయన ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. అంతే.. ఒక్క ఉదుటున చెరువులోకి దూకారు. చిన్న పిల్లాడిలా సంబరపడిపోయారు. నీళ్లలో కాసేపు ఈత కూడా కొట్టారు. ఆ తర్వాత మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. చేపల వలను ఒడ్డుకు లాక్కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రాహుల్ గాంధీని దగ్గరి నుంచి చూసిన మత్స్యకారులు ఫుల్ ఖుషీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత తమ దగ్గరికి రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో ఫోటోలు దిగేందుకు వారు పోటీలు పడ్డారు.

అనంతరం మత్స్యకారులతో మాట్లాడిన రాహుల్.. వారి జీవన విధానం గురించి తెలుసుకున్నారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార సోదరులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. వారి పని ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, అందులో సమస్యలు, సవాళ్లు, పోరాటాలు కూడా అంతే తీవ్రమైనవని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మత్స్యకారుల కఠోర శ్రమ, అభిరుచి, వ్యాపారంపై వారికున్న లోతైన అవగాహన ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించిందన్నారు రాహుల్ గాంధీ. బిహార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నదులు, కాలువలు, చెరువులు, వాటిపై ఆధారపడిన మత్స్యకారులు ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు.

Also Read: ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి.. నేను ఏం తప్పు చేశాను? దేవుడి గుడికి పర్మిషన్‌లు ఏంటి? కాశీబుగ్గ టెంపుల్ ఓనర్ సవాల్..