Lok Sabha elections 2024: ఢిల్లీ గద్దె మీద ఎగిరేదీ మన జెండానే.. తెలంగాణ నుంచే పోరాటం షురూ: సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ గద్దె మీద ఎగిరేదీ మన జెండానే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ నిజామాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన.. నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని, అనంతరం జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గిరిరాజ్‌ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. 2024లో బీజేపీ ముఖ్త్ భారత్ నినాదంతో రైతాంగం నడవాలని చెప్పారు.

Lok Sabha elections 2024: ఢిల్లీ గద్దె మీద ఎగిరేదీ మన జెండానే.. తెలంగాణ నుంచే పోరాటం షురూ: సీఎం కేసీఆర్

Telangana National Integration Day

Lok Sabha elections 2024:  కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ గద్దె మీద ఎగిరేదీ మన జెండానే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచే పోరాటాన్ని షురూ చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ నిజామాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన.. నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని, అనంతరం జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గిరిరాజ్‌ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. 2024లో బీజేపీ ముఖ్త్ భారత్ నినాదంతో రైతాంగం నడవాలని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో నాన్ బీజేపీ జెండా ఎగరబోతుందని కేసీఆర్ అన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దాని పర్యవసానంగా సాగు కూడా భారంగా మారిందని అన్నారు. కేంద్ర సర్కారు ఎన్పీఏల పేరుతో వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టిందని, రైతులకు మాత్రం ఉచితాలు ఇవ్వద్దని ప్రధాని మోదీ అంటున్నారని చెప్పారు.మనచుట్టూ జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. 60 ఏళ్ళు పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.

భారత్ మొత్తం ఆశ్చర్యపోయేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఇటువంటివి ఇతర ఏ రాష్ట్రంలోనూ లేవని చెప్పారు. దేశంలో రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ ఎక్కడా ఇవ్వడం లేదని తెలిపారు. దేశంలో నాన్ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే తెలంగాణ తరహాలో దేశ వ్యాప్తంగా ఉచితంగా విద్యుత్ అందుతుందని అన్నారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు రైతుల మోటార్ల లెక్కలు తీయమంటోందని ఆయన మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నరేంద్ర మోదీ చెబుతున్నారని విమర్శించారు. ఈ కరెంట్ మీటర్లు పెట్టుడు వెనుక పెద్ద కుట్రే ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రైళ్ళను, విమానాలను, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ఇప్పుడు రైతుల మీద పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కాసేపట్లో కేసీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.

China vs America: చైనా-అమెరికా పరస్పరం సైబర్ దాడులు?.. అగ్రరాజ్యంపై మళ్ళీ మండిపడ్డ డ్రాగన్