China vs America: చైనా-అమెరికా పరస్పరం సైబర్ దాడులు?.. అగ్రరాజ్యంపై మళ్ళీ మండిపడ్డ డ్రాగన్

అమెరికా-చైనా పరస్పరం సైబర్ దాడుల ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా, అమెరికా తమ దేశంలోని విద్యుత్తు, ఇంటర్నెట్ సంస్థలు, ఓ విశ్వవిద్యాలయం, సైబర్ నిఘా పెట్టిందని చైనా ఆరోపించింది. నార్త్‌వెస్ట్రన్ పాలిటెక్నికల్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్లపై చైనా దాడి చేస్తోందని చైనా పోలీస్ ఏజెన్సీ తెలిపింది. జూన్ లో ఆ వర్సిటీకి చెందిన కంప్యూటర్లపై దాడి జరిగినట్లు చైనా నేషనల్ కంప్యూటర్ వైరస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ పేర్కొంది.

China vs America: చైనా-అమెరికా పరస్పరం సైబర్ దాడులు?.. అగ్రరాజ్యంపై మళ్ళీ మండిపడ్డ డ్రాగన్

China vs America

China vs America: అమెరికా-చైనా పరస్పరం సైబర్ దాడుల ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా, అమెరికా తమ దేశంలోని విద్యుత్తు, ఇంటర్నెట్ సంస్థలు, ఓ విశ్వవిద్యాలయంపై సైబర్ నిఘా పెట్టిందని చైనా ఆరోపించింది. నార్త్‌వెస్ట్రన్ పాలిటెక్నికల్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్లపై చైనా దాడి చేస్తోందని చైనా పోలీస్ ఏజెన్సీ తెలిపింది. జూన్ లో ఆ వర్సిటీకి చెందిన కంప్యూటర్లపై దాడి జరిగినట్లు చైనా నేషనల్ కంప్యూటర్ వైరస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ పేర్కొంది.

తమ కమర్షియల్ సెక్యూరిటీ ప్రొవైడర్ క్విహూ 360 టెక్నాలజీ కంపెనీ ఈ విషయాన్ని గుర్తించిందని వివరించింది. అయితే, ఏ విధంగా ఈ దాడి జరిగిందన్న వివరాలు తెలపలేదు. చైనా చేసిన ఆరోపలపై ఆ దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఇప్పటివరకు స్పందించలేదు. సైబర్ పరిశోధనలో చైనా, అమెరికాతో పాటు రష్యా ముందంజలో ఉన్నాయి. తమ వాణిజ్య సంబంధమైన అంశాలపై చైనా దాడులు చేస్తోందని, సైబర్ సామర్థ్యాన్ని దుర్వినియోగం చేస్తోందని అమెరికా కూడా ఇప్పటికే పలుసార్లు చెప్పింది.

అంతేగాక, చైనా మిలటరీ కార్యాలయాపై నేరపూరిత కేసులు నమోదు చేసింది. చైనా ఆర్మీ, భద్రతా మంత్రిత్వ శాఖ ఈ సైబర్ దాడులు చేస్తోందని ఆరోపించింది. తైవాన్ విషయంలో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇందులో అమెరికా జోక్యం చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా-అమెరికా మధ్య సత్సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి.

Viral video: జిమ్‌లో వర్కవుట్ చేస్తూ తలకిందులైన మహిళ.. స్మార్ట్‌వాచ్‌తో ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్.. వీడియో వైరల్