సమ్మర్ లో చలో చలో : 108 స్పెషల్ ట్రైన్స్ ఇవే  

  • Publish Date - February 5, 2019 / 04:08 AM IST

హైదరాబాద్‌: వేసవికాలంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 108 స్పెషల్ ట్రైన్స్ ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ క్రమంలో తిరుపతి–నాగర్‌సోల్‌–నాందేడ్‌–కాకినాడల మధ్య 108 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి నెల ప్రారంభం నుండి మే నెల ఆఖరు వరకూ ఇవి కొనసాగనున్నాయని తెలిపారు.  

  • కాచిగూడ- కాకినాడ పోర్టు-కాచిగూడ మధ్య మొత్తం 28 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ప్రతి శుక్రవారం కాచిగూడలో సాయంత్రం 6.45 గంటలకు రైలు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు శనివారం సాయంత్రం 5.50 గంటలకు కాకినాడ పోర్టు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. 

     

  • తిరుపతి-కాకినాడ టౌన్‌-రేణిగుంట మధ్య మొత్తం 26 జనసాధారణ ప్రత్యేక రైళ్లు నడుపుతారు. ప్రతి ఆదివారం తిరుపతిలో సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు ప్రతి సోమవారం కాకినాడలో సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రేణిగుంట స్టేషన్‌కు ఉదయం 6 గంటలకు చేరుకుటుంది. 

     

  • తిరుపతి-నాగర్‌సోల్‌-తిరుపతి మధ్య మొత్తం 28 ప్రత్యేక రైళ్లు రాకపోకలు నడపనున్నారు. తిరుపతి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు నాగర్‌సోల్‌ చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు ప్రతి శనివారం నాగర్‌సోల్‌లో రాత్రి 10 గంటలకు బయలుదేరుతుంది.
     
  • హెచ్‌.ఎస్‌.నాందేడ్‌-తిరుపతి-హెచ్‌ ఎస్‌ నాందేడ్‌ మధ్య మొత్తం 26 ప్రత్యేక రైళ్లు ప్రయాణిస్తాయి. ప్రతి మంగళవారం హెచ్‌ఎస్‌ నాందేడ్‌లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ప్రతి బుధవారం తిరిగి ఇదే రైలు తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు హెచ్‌.ఎస్‌.నాందేడ్‌కు చేరుకుంటుంది. 
     

ట్రెండింగ్ వార్తలు