రైల్వే బోర్డు కొత్త చైర్మన్ గా సునీత్ శర్మ నియామకం
- venkaiahnaidu
- Published On : December 31, 2020 / 06:27 PM IST
new chairman of the Railway Board రైల్వేబోర్డు కొత్త ఛైర్మన్ మరియు సీఈఓగా సునీత్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ(CAA) గురువారం(డిసెంబర్-31,2020) ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ పదవీ కాలం నేటితో (2020 డిసెంబరు 31) ముగియనుంది. దీంతో తాజా నియామకం జరిగింది. ఇప్పటికే వినోద్ కుమార్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించిన విషయం తెలిసిందే.
కాగా, ప్రస్తుతం ఈస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ గా సునీత్ శర్మ ఉన్నారు. 1978 బ్యాచ్‌కు చెందిన సునీత్ శర్మ..గతంలో జోనల్ రైల్వేస్,వర్క్ షాప్స్,డీజిల్ లోకో షెడ్స్ లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. రాయబరేలి మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గాను, పూణే సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్‌గా కూడా శర్మ విధులు నిర్వహించారు.
వారణాశిలో డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ లో పనిచేస్తున్నప్పుడు…100శాతం ఎలక్ట్రిఫికేషన్ చేయాలన్న భారతీయ రైల్వేస్ లక్ష్యాన్ని సాధించేందుకు డీజిల్ లోకోమోటివ్ లను ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లుగా మార్చడంలో శర్మ పోషించిన పాత్ర చెప్పుకోదగ్గది.
