India’s Armwrestling Champion: రాహుల్ పానిక్కర్ బహుశా అందరికీ తెలియకపోవచ్చు. ఆర్మ్ రెజ్లింగ్ సర్క్యూట్‌లో కొచ్చికి చెందిన వ్యక్తి నేషనల్ స్టేజికి చేరుకున్నాడు. 70కేజీల బరువు ఉన్న ఇండియన్ నేషనల్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్ రాహుల్ ఛాలెంజెస్‌కు భయపడనని మరోసారి నిరూపించాడు. రీసెంట్‌గా ల్యారీ వీల్స్‌తో తలపడి వరల్డ్ స్ట్రాంగెస్ట్ బాడీ బిల్డర్ ను సూపర్ మ్యాచ్‌లో ఓడించి రికార్డు సాధించాడు.
అదంత ఈజీగా అయ్యే పని కాదు. అలాగే పోరాడిన రాహుల్.. స్టన్నింగ్ పర్‌ఫార్మెన్స్‌తో రికార్డు కొల్లగొట్టాడు. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన రాహుల్.. తర్వాత మూడు మ్యాచ్ లలో వరుస విజయాలు సాధించాడు. ఈ వీడియోను ఇండియన్ ఆర్మ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఫేస్‌బుక్ పేజ్‌లో షేర్ చేసింది.
ఇదంతా దుబాయ్ లో జరిగింది. ఇండియన్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ చాలా మంది కామెంట్ల రూపంలో కంగ్రాట్స్ చెబుతున్నారు. వరల్డ్ బెస్ట్ ప్రత్యర్థిని ఢీ కొట్టడం చాలా గ్రేట్ అని పొగిడేస్తున్నారు. గత దశాబ్దం రాహుల్ ఆరు నేషనల్ అవార్డులు సాధించాడు. ఈ 31ఏళ్ల వ్యక్తికి చాలా టాలెంట్లు ఉన్నాయి. అతనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా. కానీ, అతను సహజంగానే స్పోర్ట్స్ పై ఇంటరెస్ట్ ఎక్కువ.
నా కుటుంబంలో తండ్రి, నలుగురు అన్నలు ఫిట్‌నెస్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. రాహుల్ తండ్రి రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆయన పవర్‌లిఫ్టర్ కూడా. అతనికి పవర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ కూడా ఉంది. అతని అంకుల్ కూడా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. టీమిండియాకు కోచ్ కూడా వ్యవహరించారు. ఇంకొక అంకుల్ ఎమ్ పానిక్కర్ కేరళ స్టేట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కు సెక్రటరీగా పనిచేస్తున్నారు.
అతను పన్నెండో తరగతి చదువుతున్నప్పుడే ఆర్మ్ రెజ్లింగ్ లో మంచి పేరు వచ్చింది. జిల్లా స్థాయి పోటీలకు వెళ్లాడు కానీ గెలవలేకపోయాడు. రెండేళ్ల తర్వాత కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతూ మళ్లీ పోటీ చేశాడు.
ఈ సారి జిల్లా సెకండ్ తో పాటు రాష్ట్రంలోనే రెండో ర్యాంకు సాధించా. చదువుకుంటున్నా కాబట్టి నేషనల్స్ కు వెళ్లలేకపోయా. ఆ గేమ్ గెలవడంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నా స్నేహితుల మధ్య స్పోర్ట్ గురించి ప్రమోషన్ చేయడం మొదలుపెట్టా. ఆర్మ్ రెజ్లింగ్ వైపు అడుగులేసినప్పటి నుంచి అతనికి వరల్డ్ ఆర్మ్ రెజ్లింగ్ ఫెడరేషన్ మెడల్ సాధించాలనేదే కోరిక. వారానికి మూడు సార్లు ట్రైనింగ్ కు సమయం కేటాయిస్తాడు.