తలైవా రజనీకాంత్ అతి త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ట్విట్టర్ వేదికగా గురువారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ రిజిస్ట్రేషన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రజనీ రాజకీయ రంగప్రవేశంపై స్పందించారు.
‘రజనీకాంత్ పార్టీ ఇంకా రిజిష్టర్ కాలేదు. పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు ఏంటో తెలియదు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాడో లేక పొత్తు పెట్టుకుంటాడో అనే విషయంపై కూడా స్పష్టత రాలేదు. ఏం చేయబోతున్నాడో కూడా తెలియలేదు. దీనిపై స్పష్టత వస్తేనే రజనీ ప్రభావం తమిళనాడు రాజకీయాలపై ఎంత ఉంటుందో చెప్పగలం.
చాలా మంది బీజేపీ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారు. రజనీ బీజేపీతో కలుస్తాడో లేదో ఏం చేస్తాడో చూడాలని అన్నారు. మరో విషయం ఏమంటే.. తమిళనాడులోని అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి రజనీకాంత్ పార్టీ పోటీ చేయనున్నట్లు అతని పొలిటికల్ అడ్వైజర్ తమిళ్‌రువీ మణియన్ అన్నారు.
తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని 234 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం. ద్వేషపూరితమైన రాజకీయాలకు దూరంగా కనిపించబోతున్నాం. ఎవరినో తిట్టాలనుకోవడం లేదు’ అని ఆయన అన్నారు.
We will contest on all 234 seats in next Assembly elections. Our politics will be spiritual politics unlike the politics of hatred, currently being practised. We will not slam anybody: Tamilaruvi Manian, political advisor of actor Rajinikanth in Chennai pic.twitter.com/LhMN64w9tb
— ANI (@ANI) December 5, 2020