Demonetisation: నోట్ల రద్దుపై విచారణ ముగించిన సుప్రీం.. కేంద్రానికి ఆర్బీఐకి ఆదేశాలు

నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని గత విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేవలం నల్లధనం కోణంలోనే కాకుండా, విస్తృత కోణంలో నాటి నిర్ణయాన్ని చూడాలని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కోరారు. ఏదైనా పనిలో ఒక వ్యక్తి విఫలమైనంత మాత్రాన.. ఆయన ఉద్దేశం లోపభూయిష్టమైందని చెప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

Demonetisation: నోట్లరద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ ముగించింది. ఆరేళ్ల క్రితం 2016లో తీసుకున్న నోట్ల రద్దు వల్ల, అప్పటికే చెలామణిలో ఉన్న పెద్ద నోట్లు ఒక్కసారిగా రద్దయ్యాయి. రూ.1000, రూ.500 నోట్లు చెల్లకుండా మిగిలిపోయాయి. ఆ సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. నోట్లరద్దు పర్యవసానాలను పేర్కొంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే దీనిపై విచారణ ముగించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ నిర్ణయానికి సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రిజర్వ్ బ్యాంకును ఆదేశించింది.

Bihar: నితీశ్ కుమార్ ‘నపుంసకుడు’ అంటూ కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

అనంతరం, పిటిష్లపై తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి కోర్టు ముందు హాజరయ్యారు. సుప్రీం ఆదేశాలపై ఆయన స్పందిస్తూ సంబంధిత రికార్డులను సీల్డ్ కవరులో సమర్పిస్తామని తెలియజేశారు. 2016 నవంబరు 8న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీం కోర్టు కొంత కాలంగా విచారణ చేస్తోంది.

Forbes List: వరుసగా నాలుగోసారీ శక్తివంతమైన మహిళగా నిలిచిన నిర్మలా సీతారామన్

నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని గత విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేవలం నల్లధనం కోణంలోనే కాకుండా, విస్తృత కోణంలో నాటి నిర్ణయాన్ని చూడాలని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కోరారు. ఏదైనా పనిలో ఒక వ్యక్తి విఫలమైనంత మాత్రాన.. ఆయన ఉద్దేశం లోపభూయిష్టమైందని చెప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు