SC Dismiss Sanskrit Plea: సంస్కృతాన్ని జాతీయ భాష చేయాలంటూ పిటిషన్.. సుప్రీం స్పందనేంటంటే?

దీనిపై సుప్రీం స్పందిస్తూ ‘‘సంస్కృతం నుంచి పలు భాషలు కొన్ని పదాలు తీసుకున్నాయని మాక్కూడా తెలుసు. అంత మాత్రాన సంస్కృతాన్ని జాతీయ భాష చేయాలని మేము ఆదేశాలు ఇవ్వలేం. దానికి రాజ్యాంగ సవరణ అవసరం. ఒక్క శాసనశాఖకు మాత్రమే అది సాధ్యం’’ అని సమాధానం ఇచ్చింది.

SC Dismiss Sanskrit Plea: సంస్కృత భాషను జాతీయ భాషగా చేయాలంటూ వేసిన పిటిషన్‭ను విచారణకు తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎం.ఆర్.షా, క్రిష్ట మురారి నేతృత్వంలోని సుప్రీం బెంచ్ దీనిపై స్పందిస్తూ పబ్లిసిటీ కోసం ఇలాంటి పిటిషన్లు వేయకూడదని సూచించింది. వాస్తవానికి ఇలాంటి అంశాలు తమ పరిధిలో ఉండవని, సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, దీనిపై పార్లమెంట్‭లో చర్చ ద్వారా మాత్రమే సాధ్యం చేసుకోవచ్చని సూచించింది.

ఈ విషయమై పిటిషన్ వేసిన లాయర్ సుప్రీంకోర్టు బెంచ్ ముందు తన వాదనలు వినిపిస్తూ సంస్కృతం మాతృ భాషని అన్నారు. ఈ భాష నుంచే అనేక భాషలు స్ఫూర్తి పొందాయని అంటూనే ఈ చారిత్రక భాషపై విలియమ్ జోన్స్ చేసిన అధ్యయనాన్ని పదే పదే గుర్తు చేశారు. అయితే దీనిపై సుప్రీం స్పందిస్తూ ‘‘సంస్కృతం నుంచి పలు భాషలు కొన్ని పదాలు తీసుకున్నాయని మాక్కూడా తెలుసు. అంత మాత్రాన సంస్కృతాన్ని జాతీయ భాష చేయాలని మేము ఆదేశాలు ఇవ్వలేం. దానికి రాజ్యాంగ సవరణ అవసరం. ఒక్క శాసనశాఖకు మాత్రమే అది సాధ్యం’’ అని సమాధానం ఇచ్చింది.

అయితే పిటిషనర్ ఇదే విషయమై బెంచ్‭ను ఆకట్టుకోవడానికి తరుచూ సంస్కృతం గురించి ఏవేవో చెప్తున్నారు. ఈ సందర్భంలో సుప్రీం కాస్త వ్యంగ్యంగా స్పందిస్తూ సంస్కృతాన్ని జాతీయ భాష చేయాల్సిన అవసరం ఉంటే ఉండొచ్చు గాక, కానీ మీరు ప్రస్తుతం కొన్ని వాక్యాలైనా సంస్కృతంలో మాట్లాడండి అంటూ పిటిషనర్ లాయర్‭కు చురకంటించింది. సంస్కృత భాషను జాతీయ భాష చేయాలన్న పిటిషన్ మాత్రం విచారణకు తీసుకోలేదు.

Kalyan Chaubey: ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా కల్యాణ్ చౌబే.. 33-1 తేడాతో భూటియా ఘోర పరాజయం

ట్రెండింగ్ వార్తలు