స్నూపింగ్ ఆర్డర్ : దర్యాప్తు సంస్థలకు అధికారాలను పరిశీలిస్తాం

  • Publish Date - January 14, 2019 / 07:56 AM IST

కంప్యూటర్లపై నిఘా పెట్టడానికి వీలుగా 10 దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని పరిశీలిస్తామని సోమవారం(జనవరి 14,2019) సుప్రీంకోర్టు తెలిపింది. గతేడాది డిసెంబర్ 20న పది దర్యాప్తు సంస్థలకు కంప్యూటర్లపై నిఘాకు అనుమతిస్తూ కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది శ్రేయా సింఘాల్, తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహువా మోయిత్రా సుప్రీంకోర్టు న్యాయవాది ఎమ్ఎల్ శర్మ మరికొంతమంది సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రభుత్వ ఆర్డర్ వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడేమని, వెంటనే ఆ ఆర్డర్ ని రద్దుచేయాలంటూ ఆ పిటిషన్ లో తెలిపారు.  ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు..ఆరువారాల్లోగా దీనిపై తమ స్పందన తెలియజేయాలని  కేంద్రాన్ని ఆదేశించింది.