కులం పేరుతో.. మతం పేరుతో..: ఎన్నికల సంఘంకు నోటీసులు

ఎన్నికలవేళ కులాలను, మతాలను ఉద్దేశించి ప్రసంగాలు చేయకూడదని, అలా చేసే రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కోర్టు విచారణ జరిపింది.

  • Publish Date - April 9, 2019 / 02:03 AM IST

ఎన్నికలవేళ కులాలను, మతాలను ఉద్దేశించి ప్రసంగాలు చేయకూడదని, అలా చేసే రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కోర్టు విచారణ జరిపింది.

ఎన్నికలవేళ కులాలను, మతాలను ఉద్దేశించి ప్రసంగాలు చేయకూడదని, అలా చేసే రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కోర్టు సోమవారం (8 ఏప్రిల్ 2019) విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్‌ 15వ తేదీలోగా తమ వివరణ తెలపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 
Read Also : మైలవరానికి రూ.100 కోట్లు.. మంగళగిరికి రూ.200 కోట్లు పంపారు

రాజకీయ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు కులాలు, మతాలను ఉద్దేశించి ప్రసంగించినా, ఆరోపణలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హర్‌ప్రీత్‌ మన్సుఖనీ అనే ఎన్నారై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. వీటిపై చర్చావేదికలు పెట్టే మీడియా ప్రతినిధులపై కూడా చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. 

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్దే తన వాదనలు వినిపించారు. వాదనల అనంతరం పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని ఈసీని ఆదేశించింది సుప్రీం కోర్టు. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. 
Read Also : ఎన్నికల వేళ కలకలం : రూ.281 కోట్ల భారీ కుంభకోణం