సీబీఐ వివాదంపై సుప్రీం ఆదేశం : సీఎం మమత హర్షం 

  • Publish Date - February 5, 2019 / 09:45 AM IST

ఢిల్లీ : బెంగాల్ పోలీసులు..సీబీఐ వివాదం పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ సీపీ..సీఎం మమత సీబీఐ విచారణకు హాజరుకావాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. ధర్మాసనం తీర్పును తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఈ తీర్పు అధికారులకు నైతిక బలాన్నిచ్చేలా ఉందన్నారు. ఈ తీర్పు మా నైతిక విజయం. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలన్నిటిపైనా మాకు అపార గౌరవం ఉంది. వాటికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్ సీబీఐ ముందు విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించిన సంగతి తెలిసిందే. రాజీవ్ కుమార్ అరెస్టు చేయకుండా..ఎటువంటి ఒత్తిడి పెట్టవద్దని సీబీఐకి సుప్రీం స్పష్టం చేసింది. 

రాష్ట్రంలోని అధికారులను అరెస్టు చేయడానికి కేంద్ర యంత్రాంగం వచ్చినప్పుడు తాము ఎప్పుడూ అడ్డుకోబోమనీ..ఎన్డీయే ప్రభుత్వ హాయాంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందనీ ఆరోపించారు. సీబీఐ ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే పీసీ రాజీవ్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు యత్నించినందుకే పోలీసులు వారిని అడ్డుకున్నారని మమత తెలిపారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆయనను అరెస్టు చేయవద్దని స్పష్టంగా చెప్పిన విషయాన్ని మమత గుర్తు చేశారు. 
 
కేసు అసలు నేపథ్యం 
కాగా శారద చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నేతృత్వం వహిస్తున్న కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్…. ఈ కేసులోని ఆధారాలు మాయం చేశారంటూ సీబీఐ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సీపీని ప్రశ్నించేందుకు ఆదివారం 40 మందికి పైగా సీబీఐ అధికారులు ఆయన ఇంటికి వెళ్లడంతో స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పశ్చిమబెంగాల్ పోలీసులకు, సీబీఐ అధికారులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. మరోవైపు రాజకీయ కక్ష సాధింపుతో కేంద్ర ప్రభుత్వం తమపైకి సీబీఐని ఉసిగొల్పుతున్నారంటూ సీఎం మమత ధర్నాకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మమతా స్వాగతించారు.