పాక్ చేస్తానంది… మనం చేసి చూపెట్టాం  

  • Publish Date - February 26, 2019 / 08:01 AM IST

ఢిల్లీ : పాకిస్థాన్ పై వాయుసేన జరిపిన ఏరియల్ స్ట్రైక్స్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. భారత్ కు వెయ్యి గాయాలు చేస్తామని పాకిస్థాన్ ప్రగల్భాలు పలికిందనీ..వెయ్యి బాంబులను వారికి ఇవ్వడం ద్వారా (సర్జికల్ ఎటాక్) మనం సరైన తగిన బుద్ధి చెప్పిందని అన్నారు.
Also Read : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి

మన భారత వాయుసేన జరిపిన దాడుల్లో ఎక్కువ భాగం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనే జరిగాయని..ఆ ప్రాంతమంతా భారత్ దేనని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు.మన భూభాగంపై మనం బాంబులు వేయడంలో బాధపడాల్సిన అవసరమేలేదన్నారు. దాడులు జరిగిన ప్రాంతం పాకిస్థాన్ ప్రధాన భూభాగమైనా… ఐక్యరాజ్యసమితి చార్టర్ లో పేర్కొన్న విధంగా దేశ రక్షణ కోసం పాక్ ప్రధాన భూభాగంపై దాడులు చేయడంలో తప్పులేదని అన్నారు. భారత్ పై నిత్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్ పై భారత్ ఎదురు దాడులకు దిగటం తప్పేకాదన్నారు. 
Also Read : కుర్రాళ్లు అదరగొట్టారు : సర్జికల్ స్ట్రైక్‌పై క్రికెటర్ల కామెంట్స్