Fake Swamiji: దెయ్యం వదిలిస్తానంటూ మహిళను చిత్రహింసలు పెట్టిన స్వామిజి
- kunduru Vinod
- Published On : May 8, 2021 / 12:51 PM IST
Fake Swamiji
Fake Swamiji: దేశంలో బాబాలను స్వామిజీలను నమ్మేవారు తక్కువేం లేరు. ఇటువంటి వారినే మార్కెట్ గా మలుచుకొని ఊరుకో బాబా వీధికో స్వామిజి పుట్టుకొస్తున్నారు. పెట్టుబడి లేకుండా డబ్బు వచ్చే పనికావడంతో ఎటువంటి శక్తులు లేకున్నా అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇక తమిళనాడులో పౌడర్ స్వామిజిది ఇటువంటి పద్దతే. ఆరోగ్యం బాగాలేని వారు, మానసిక స్థితి సరిగా లేనివారిని టార్గెట్ గా చేసుకొని వారికి బాగు చేస్తానంటూ చితక్కొడతాడు.
కొరడా, కర్రలతో కొడుతూ చిత్ర హింసలు పెడుతుంటాడు. ఆలా అతను కొడితే తమను ఆవహించిన దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్మిన వారు ఈ స్వామిజి దగ్గరకు తండోపతండాలుగా వస్తున్నారు. కర్ర, కొరడాలతో కొడుతుండటంతో చాలామందికి గాయాలయ్యాయి. కొట్టే ముందే ఆ స్వామిజి తాను కొట్టినట్లు ఎవరికీ చెప్పకూడదని, దెబ్బలు తగిలినా నవ్వుతూనే బయటకు వెళ్లాలని, ముఖంలో ఆనందం ఉండాలని చెబుతుంటాడట. స్వామిజి ఓ మహిళను కర్రతో కొడుతుండగా కొందరు వ్యక్తులు దానిని వీడియో తీశారు. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియో పోలీసుల కంట పడటంతో వారు ఆరా తీశారు.
తమిళనాడు రాష్ట్రము నామక్కల్ జిల్లా కాదపల్లికి చెందిన అనిల్ కుమార్ (42) గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకోని వేలగౌండం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా మంజనాయకనూరు కరుప్పన్నస్వామి ఆలయాన్ని తన వికృత చేష్టలు అడ్డాగా మార్చుకున్నాడు. దెయ్యం పట్టిందని వచ్చిన మహిళలను దారుణంగా కొట్టేవాడు. బయట ఎవరికీ చెప్పొద్దని బెదిరించేవాడు. ఇప్పటికే స్వామిజి చేతిలో వందలమంది మహిళలు చిత్రహింసలకు గురైనట్లు తెలుస్తుంది.
