Viral Video : పార్సిల్ ఇచ్చి కస్టమర్ షూ కొట్టేసిన స్విగ్గీ డెలివరీ బాయ్.. వీడియో వైరల్
ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ చేసిన ఘనకార్యం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 12, 2024 / 04:55 PM IST
Swiggy Agent Stealing Shoes Outside Flat video viral
ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ చేసిన ఘనకార్యం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కస్టమర్‌కు కావాల్సిన సరకులను డెలివరీ ఇచ్చిన అతడు.. అక్కడ ఉన్న షూను దొంగిలించాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో మంగళవారం ఏప్రిల్ 9న చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఏం ఉందంటే..?
గ్రాసరీని డెలివరీ చేసేందుకు మెట్లు ఎక్కి వచ్చాడు ఓ డెలివరీ ఏజెంట్. సరకులు ఇచ్చేందుకు అతడు డోర్ బెల్ మోగించాడు. ఆ తరువాత అతడు చుట్టు పక్కల గమనించాడు. అతడికి కుడి పక్కన మూడు జతల షూలు కనిపించాయి. ఈ లోగా ఓ మహిళ డోర్ తెరిచింది. తాను తెచ్చిన ప్యాకెట్ ఆమెకు ఇవ్వగా.. ఆమె తీసుకుని వెంటనే డోర్ వేసింది. తన ఫోన్ తీసుకుని కాసేపు ఏదో నొక్కాడు.
Viral Video: ఎంత ధైర్యం.. దూసుకొచ్చిన పులితో సెల్ఫీ తీసుకున్న యువకుడు
అనంతరం కొన్ని మెట్టు కిందకు దిగాడు. ఎవరైనా వస్తున్నారు ఎమో అని చెక్ చేసుకున్నాడు. తన తలకు చుట్టుకు వచ్చిన టవల్లో ముఖాన్ని తుడుచుకున్నాడు. మెల్లగా పైకి ఎక్కి అక్కడ ఉన్న షూలోని ఓ జతను అందుకున్నాడు. వాటిని తన టవల్లో చుట్టుకుని ఎంచక్కా అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.
స్విగ్గీ డ్రాప్ అండ్ పికప్ సర్వీస్.. నా స్నేహితుడి షూలను ఓ డెలివరీ ఏజెంట్ దొంగిలించాడు. సంస్థ అతడి వివరాలను ఇవ్వలేదు అంటూ రోహిత్ అరోరా అనే వ్యక్తి ఏప్రిల్ 11న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 716 716K వీక్షణలు వచ్చాయి. ఈ వైరల్ వీడియో పై స్విగ్గీ కేర్స్ స్పందించింది. తమను నేరుగా సంప్రదించాలని, అవసరమైన సాయం అందిస్తామని చెప్పింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Lok Sabha Elections 2024: మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
