చైనాలో పుట్టి, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌తో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఇప్పటికే వేల మందిని పొట్టనబెట్టుకున్న ఈ వైరస్ మహమ్మారిగా మారిపోయింది. లక్షల మందికి ఈ వైరస్ సోకడంతో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు.
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసిన కరోనావైరస్ మహమ్మారి పేరును ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సోహ్గౌరా గ్రామంలో ఓ శిశువుకు పెట్టారు. కరోనావైరస్ వ్యాప్తిని పరిష్కరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ రోజు (22 మార్చి 2020) ఆ శిశువు పుట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
శిశువు మావయ్య నితేష్ త్రిపాఠి మాట్లాడుతూ.. శిశువుకు ఘోరమైన వైరస్ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నామని, ఎందుకంటే ఇది ఒక సమస్యపై ప్రపంచాన్ని ఏకం చేసిందని, ప్రపంచాన్ని ఏకం చేసిన వైరస్ పేరు పాపకు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.
శిశువుకు పేరు పెట్టడానికి తల్లి రాగిణి త్రిపాఠి అనుమతి తీసుకున్నట్లు మావయ్య త్రిపాఠి చెప్పారు. వైరస్ ప్రమాదకరమైనదే. ఇది ప్రపంచంలో చాలా మందిని చంపింది కూడా, కానీ ఇది మనలో చాలా మంచి అలవాట్లను పెరిగేలా చేసింది. ప్రపంచం మొత్తాన్ని ఒక విషయం కోసం పోరాడేలా చేసింది. ఈ బిడ్డ చెడుతో పోరాడటానికి ప్రజల ఐక్యతకు చిహ్నంగా నిలవాలని ఈ పేరు పెట్టినట్లు చెప్పారు.
See Also | కరోనా కట్టడికి ఐబీ సాయం