13 year old Boy Designs Robot : తిడితే ఊరుకోనంటున్న రోబో .. సారీ చెప్పేదాకా మాట్లాడట..

13 ఏళ్ల పిల్లాడు ఓ రోబోను తయారు చేశాడు. ఆరోబోకి మహా కోపం.తిడితే అస్సలు ఊరుకోదు. సారీ చెప్పేదాకా తగ్గేదేలేదు..మాట్లాడాదేలేదని మొహంమీదే కరాఖండీగా చెప్పేస్తోంది. 13 ఏళ్లకే రోబోను తయారు చేసిన బాలుడే ముదురు అనునకంటే ఆబాలుడు తయారు చేసిన రోబో అంతకంటే ముదురులా ఉంది.

13 year old boy designs robot that understands human feeling

13 year old Boy Prateek Designs Robot : 13 ఏళ్ల పిల్లాడు ఓ రోబోను తయారు చేశాడు. ఆరోబోకి మహా కోపం. తిడితే అస్సలు ఊరుకోదు. సారీ చెప్పేదాకా తగ్గేదేలేదు..మాట్లాడాదేలేదని మొహంమీదే కరాఖండీగా చెప్పేస్తోంది. 13 ఏళ్లకే రోబోను తయారు చేసిన బాలుడే ముదురు అనునకంటే ఆబాలుడు తయారు చేసిన రోబో అంతకంటే ముదురులా ఉంది. మరి రోబోను తయారు చేసిన బాలుడు ఎవరు? ఆ రోబో పేరేంటీ? ఆ రోబోకి ఎందుకంత కోపమో తెలుసుకోవటానికి తమిళనాడుకి ఓ ట్రిప్పేద్దాం పదండీ..

ఇప్పటివరకు మనం రోబో చిట్టిని చూశాం.. మాట్లాడే మర మనిషినీ చూశాం.. హోటల్‌లో ఫుడ్ సర్వ్ చేసే రోబోనూ చూశాం.. చక్కగా పనులు చేసిపెట్టే రోబోనూ చూశాం.. మరి అదే రోబోకి ఎమోషన్స్‌ ఉంటే..? అలాంటి యంత్రాన్నే తయారు చేశాడు చెన్నై విద్యార్థి..

రోబో మహా అయితే ఏం చేస్తుంది.. మనం ఏదైనా ప్రశ్న అడిగితే కరెక్ట్‌గా సమాధానం చెబుతుంది.. పని చెబితే చక్కగా చేసి పెడుతుంది. ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం పని చేస్తుంది. మరి ఇక్కడ ఉన్న రోబో స్పెషాలిటీ ఏంటో తెలుసా.. ఎమోషన్స్.. అవునండీ హ్యూమన్ ఎమోషన్స్‌ను ఇది బాగా అర్థం చేసుకుంటుంది. ఈ రోబో ఎదుటి వ్యక్తి విచారంగా ఉంటే పసిగడుతుంది. అంతే కాదు ఎవరైనా తిడితే ఊరుకోనంటుంది.. సారీ చెప్పేదాకా తగ్గేదే లేదని..మాట్లాడేదే లేదని మొహం మీదే చెప్పేస్తుంది..

ఈ రోబోని తయారు చేసింది పెద్ద సైంటిస్ట్ అనుకుంటే పొరబాటే.. దీన్ని తయారు చేసింది 13 ఏళ్ల బాలుడు ప్రతీక్‌. తాను తయారు చేసిన రోబోకి రఫి అని పేరు కూడా పెట్టుకున్నాడు.. చిన్నప్పటి నుంచే తనకు ఇలాంటి ఆవిష్కరణలపై ఎంతో ఆసక్తి ఉందని చెబుతున్నాడు ప్రతీక్. తన ప్రతిభకు గాను 13ఏళ్లకే ఎన్నో మెడల్స్‌ సొంతం చేసుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే వినూత్నమైన రోబో తయారు చేసిన ప్రతీక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది..