Shashi Tharoor: కదలడు, వదలడు..! కాంగ్రెస్ కంట్లో నలుసులా మారిన శశిథరూర్.. ఇంతకీ ఆయన దారెటు?

ఈ ఆట అంతా ఎవరాడిస్తున్నారో తెలుసు..ఈ ఆటలో భాగం కావాలా వద్దా అనేది వారికి తెలీదా అంటూ శశిథరూర్‌పై మండిపడ్డారు.

Shashi Tharoor: కదలడు, వదలడు..! కాంగ్రెస్ కంట్లో నలుసులా మారిన శశిథరూర్.. ఇంతకీ ఆయన దారెటు?

Updated On : December 12, 2025 / 9:23 PM IST

Shashi Tharoor: కాంగ్రెస్ అగ్రనేత.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం నిర్వహించిన సమావేశానికి శశిథరూర్ వెళ్లలేదు. ఆయనిలా చేయడం ఇదేం మొదటిసారి కాదు..మూడోసారి..ఐతే కొంతమంది మాత్రం శశిథరూర్ రాహుల్‌గాంధీకి తన ఇతర కార్యక్రమాల గురించి ముందే సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. ఐతే కాంగ్రెస్ చీఫ్ విప్ మాత్రం శశిథరూర్ ఎందుకు మీటింగ్‌కి రాలేదో కారణం తెలీదన్నారు.

ప్రధానమంత్రి మోదీ చేపట్టే కార్యక్రమాలను పొగడటం.. ఎన్డీఏ పాలసీలను భుజాన మోయడం తిరువనంతపురం ఎంపీకి కామన్‌గా మారింది. ఈ క్రమంలో శశిథరూర్ కాంగ్రెస్‌కి పరోక్షంగా చురకలు కూడా వేస్తున్నారు. ఇది గత ఏడాది కాలంలో మరీ ఎక్కువైంది. ప్రధాని మోదీ కేరళలో ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే అక్కడ శశిథరూర్ ప్రత్యక్షమవుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ పన్నాగాలను ఎండగట్టేందుకు ఎంపీల బృందాలను కేంద్రం వివిధ దేశాలకు పంపింది. వాటిలో ఓ దానికి శశిథరూరే లీడర్‌గా వ్యవహరించారు.

శుక్రవారం నాటి సమావేశానికి శశిథరూర్ రాకపోయినా..ఆయన వెర్షన్ మాత్రం క్లియర్‌గానే చెప్పారు. తానేం ఈ మీటింగ్స్‌కి కావాలని స్కిప్ చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఐతే అంతకుముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పై జరిగిన చర్చలను కూడా మిస్సయ్యారాయన. 90ఏళ్ల తన తల్లితో కలిసి విమానంలో వస్తున్నానని, సరైన సమయంలో రాలేకపోయినట్లు వివరణ ఇచ్చారు. ఆ సమావేశానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కూడా
గైర్హాజరయ్యారు.

ఇలా కారణమేదైనా సరే సమావేశాలకు డుమ్మా కొట్టడం ఇతరులకైతే ఓకే కానీ బీజేపీ పాలసీలను.. ఎన్డీఏ నిర్ణయాలను అవసరం లేకపోయినా అదే పనిగా పొగుడుతూ కాంగ్రెస్‌కి కంటిలో నలుసులా తయారయ్యారు శశిథరూర్.. దానికి తోడు ఓవైపు ప్రతిపక్ష నేతగా తనని రష్యా అధ్యక్షుడితో సమావేశానికి ఆహ్వానించాలని రాహులే స్వయంగా డిమాండ్ చేసారు. దానిని కేంద్ర ప్రభుత్వం పక్కనబెట్టేసింది. అది అలా ఉండనీయకుండా.. శశిథరూర్‌ని మాత్రం పుతిన్‌ డిన్నర్ పార్టీకి పిలిచింది. దీంతో ఇది కేవలం కాంగ్రెస్‌ను ఇరిటేట్ చేయడానికే అనేది అర్ధమవుతోంది. పైకి ఎన్ని డిప్లమాటిక్ రీజన్స్ అయినా చెప్పొచ్చుగాక.. ఆ కాకమ్మ కబుర్లు ఇప్పుడెవరూ నమ్మడం లేదు. అందుకే పవన్ ఖేరా అనే కాంగ్రెస్ ప్రతినిధి క్రిస్టల్ క్లియర్‌గా ఓ మాట చెప్పారు.

ఈ ఆట అంతా ఎవరాడిస్తున్నారో తెలుసు..ఈ ఆటలో భాగం కావాలా వద్దా అనేది వారికి తెలీదా అంటూ శశిథరూర్‌పై మండిపడ్డారు. ఐతే డైరక్ట్‌గా కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకూ శశిథరూర్‌కి వ్యతిరేకంగా ఒక్క మాటా మాట్లాడలేదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా శశిథరూర్ డైలాగులేశారు. ఐనా శశిథరూర్‌ని ఇగ్నోర్ చేశారంటే దానర్ధం.. శశిథరూర్‌ని ప్రస్తుతానికి పట్టించుకోకపోవడమే మంచిదని కాంగ్రెస్ అగ్రనాయకత్వం డిసైడైనట్లుంది.

Also Read: ‘వెయిట్ లాస్ డ్రగ్’.. ఇండియాలోకి వచ్చేసిన ఒజెంపిక్.. ఒక్కో డోస్ ధర..