Tamil Nadu Election Survey: తమిళ ఓటర్లు ఎవరి వైపు.. డీఎంకే దూకుడుకు టీవీకే బ్రేక్ వేస్తుందా..? తాజా సర్వేలో ఏం తేలిందంటే?

Tamil Nadu Elections Survey 2026 : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈనెల 23న ఇక్కడ పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతోంది. అయితే, తాజాగా తమిళ ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారని జూనియర్ వికటన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాల్లో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Tamil Nadu Assembly Elections 2026 Junior Vikatan Survey Results

Tamil Nadu Assembly Elections 2026 : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ప్రచారానికి మరికొద్ది రోజులే ఉండటంతో పార్టీల అధినేతలు, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య పోటీ నెలకొంది. టీవీకే పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది.

Also Read :  మహిళా రిజర్వేషన్ బిల్లు.. నెక్ట్స్ ఏంటి?

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈనెల 23న ఇక్కడ పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రచారానికి మరో మూడు రోజులే గడువు ఉండటంతో పలు సర్వే సంస్థలు ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారని సర్వేలు చేస్తున్నాయి. ఈ క్రమంలో జూనియర్ వికటన్ తాజా సర్వే నిర్వహించింది.

రాష్ట్ర వ్యాప్తంగా యువ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపినట్లు సర్వే పేర్కొంది. తొలిసారి ఓటు వేయబోతున్న మెజార్టీ యువత టీవీకే అభ్యర్థులకు పట్టం కట్టొచ్చని ఈ సర్వే అభిప్రాయ పడింది. యువత టీవీకే వైపు ఆకర్షితులు కావడం వల్ల డీఎంకే, ఏఐఏడీఎంకేలు నష్టపోతాయని, ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకులు చీలుతాయని, అలాగని ఈ ఎన్నికల్లో టీవీకే గెలుస్తుందనే గ్యారంటీ కూడా లేదని సర్వే తేల్చి చెప్పింది. చివరికి జూనియర్ వికటన్ సర్వే చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే స్వల్ప మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, లేదంటే హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

234 నియోజకవర్గాల్లోని 93,600 మంది ఓటర్లపై జూనియర్ వికటన్ నిర్వహించిన సర్వే ప్రకారం.. డీఎంకే కూటమి 37.5శాతం ఓట్లతో 121 సీట్లను గెలుచుకుని ఆధిక్యంలో ఉండగా, ఏఐఏడీఎంకే 33.63శాతం ఓట్లతో 83 సీట్లతో రెండో స్థానంలో ఉంది. తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్‌కు బలమైన వ్యక్తిగత మద్దతు ఉన్నప్పటికీ టీవీకే మూడో స్థానంతోనే సరిపెట్టుకునే అవకాశం ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ పార్టీకి మూడు సీట్లు దక్కొచ్చు. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ లో విజయ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు చోట్ల ఆయన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వే పేర్కొంది. విల్లివాక్కంలో గట్టి పోటీ ఉన్నా టీవీకే అభ్యర్థి అర్జున్ గెలిచే అవకాశం ఉంది. మరో 27 నియోజకవర్గాల్లో టీవీకే గట్టి పోటీ ఇస్తుందని సర్వే అంచనా వేసింది.

పాత డీఎంకే – ఏఐఏడీఎంకే పాలనతో విసిగిపోయిన యువతలో అధిక శాతం టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, బలహీనమైన సంస్థాగత నిర్మాణం సీట్ల గెలుపును పరిమితం చేయడమే కాకుండా, ఓట్లు చీలిపోయి డీఎంకేకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉండోచ్చని సర్వే అంచనా వేసింది.