CM Vijay: సీఎం విజయ్ ‘సింగప్పెన్’ సైన్యం.. మహిళల రక్షణ కోసం దేశంలోనే మొదటిసారి.. ఈ విభాగం ఏం చేస్తుందో తెలుసా?

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌(CM Vijay) ప్రభుత్వం మహిళల రక్షణ కోసం సరికొత్త విప్లవాత్మక అడుగు వేసింది.

Tamil Nadu CM Vijay launches Singappan special team for women safety

  • తమిళనాడులో ‘సింగప్పెన్’ పోలీస్ విభాగం.
  • మహిళల రక్షణకు డ్రోన్ పెట్రోలింగ్.
  • కొత్తగా ఇరవైఐదు వందల నియామకాలు.

CM Vijay: తమిళనాడు ప్రభుత్వం మహిళల రక్షణ కోసం సరికొత్త విప్లవాత్మక అడుగు వేసింది. రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అడ్డుకునేందుకు ‘సింగప్పెన్‌’ (తమిళంలో ఆడసింహం వంటి ధైర్యశాలి) అనే ప్రత్యేక పోలీస్‌ విభాగాన్ని ముఖ్యమంత్రి విజయ్‌ (CM Vijay)మంగళవారం ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల భద్రత కోసం ఈ విభాగం ద్వారా డ్రోన్‌ పెట్రోలింగ్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ విభాగానికి కాకీ ప్యాంటు, బ్లూ షర్ట్‌తో కూడిన ప్రత్యేక యూనిఫాంను రూపొందించడమే కాకుండా, దీనికి సంబంధించిన అధికారిక లోగోను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

Ap Rains: ఒకవైపు మండే ఎండలు.. మరోవైపు భారీ వానలు.. ఏపీ ప్రజలకు విపత్తుల సంస్థ కీలక హెచ్చరిక

మహిళల రక్షణకు అత్యంత సహాయకారిగా నిలిచే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం తమిళనాడు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. సింగప్పెన్‌ విభాగం బలోపేతానికి రూ.354 కోట్లు వెచ్చించనున్నట్లు, ఇందులో భాగంగా కొత్తగా 2,500 మంది సిబ్బందిని నియమించనున్నట్లు సీఎం విజయ్ వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో, ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందితో పనిచేసే ఈ సరికొత్త పోలీస్ విభాగం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలకు, వేధింపులకు అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషించనుంది.