Vijay Election Result: విజయ్ సంచలనం.. పోటీ చేసిన రెండు చోట్లా విజయం
Vijay Thalapathy Election Result: పెరంబూరులో డీఎంకే అభ్యర్థి శేఖర్ పై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తిరుచ్చి ఈస్ట్ లో 20వేల ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు.
- Naveen
- Updated on- May 4, 2026 / 06:26 PM IST
Vijay Election Result: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు, టీవీకే చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. పోటీ చేసిన రెండు చోట్ల నుంచి ఆయన గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ బరిలోకి దిగారు. ఆ రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. పెరంబూర్ లో డీఎంకే అభ్యర్థి శేఖర్ పై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తిరుచ్చి ఈస్ట్ లో 20వేల ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు. పెరంబూరు చెన్నై నగర శివారులో ఉంటుంది.
నిజానికి ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో తిరుచ్చి ఈస్ట్ లో విజయ్ వెనుకంజలో ఉన్నారని, పెరంబూరులో మాత్రం విజయం సాధించబోతున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. కానీ అనూహ్యంగా ఒక గంట వ్యవధిలోనే సీన్ పూర్తిగా మారిపోయింది. రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ విజయ్ దూసుకుపోయారు. అటు రాష్ట్రవ్యాప్తంగా టీవీకే స్వీప్ చేసింది. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో వచ్చి ఆగింది టీవీకే. రెండో చోట్ల నుంచి తాను పోటీ చేస్తున్నట్లు విజయ్ ప్రకటించగానే చాలా విమర్శలు వచ్చాయి.
ఒక ధృడ సంకల్పంతో విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2024 ఫిబ్రవరిలో పార్టీ పేరు ప్రకటించారు. ఒక నటుడు రాజకీయాల్లో ఏం నెట్టుకొస్తాడు అని చాలా మంది అవహేళన చేశారు. తమిళ రాజకీయాల్లో అందుకు ఆస్కారం లేదన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లో సక్సెస్ కారు అని మరికొందరు అన్నారు. ఇన్ని అవాంతరాలు దాటుకుంటూ విజయ్ ముందుకు సాగాడు. చాలా కష్టపడి తన పార్టీని ముందుకు నడిపించాడు. ప్రత్యేకించి ఏడాది కాలంలో విజయ్ రాజకీయపరమైన, కుటుంబపరమైన, వ్యక్తిగతపరమై, సినిమా పరంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అనేక ఇబ్బందులు విజయ్ ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. వాటన్నింటిని అధిగమిస్తూ ముందుగా సాగారు విజయ్. చివరకు ఘన విజయం సాధించారు.
Also Read: గెలుపు దిశగా విజయ్ డ్రైవర్ కొడుకు.. మళ్లీ వైరల్ గా మారిన పాత వీడియో..
