VS Babu: స్టాలిన్‌ని మట్టికరిపించింది ఈయనే.. విజయ్ వదిలిన బాణం..

స్టాలిన్ కొలత్తూరు నుంచి పోటీ చేయడం ఇది నాలుగోసారి. కొలత్తూరును తన సొంత నియోజకవర్గంగా భావిస్తూ వచ్చారు స్టాలిన్. కానీ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు.

  • Updated on- May 4, 2026 / 04:43 PM IST

VS Babu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం జరిగింది. ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. డీఎంకేకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చీఫ్, సీఎం స్టాలిన్ ఓటమిపాలయ్యారు. వరుసగా ఆరుసార్లు గెలిచిన స్టాలిన్ ఈసారి ఓడిపోయారు. వరుసగా రెండోసారి డీఎంకే అధికారంలోకి వస్తుందని, తాను ముఖ్యమంత్రిని అవుతానని స్టాలిన్ కలలు కన్నారు. కానీ, ఏకంగా ఆయన పరాజయం చవిచూశారు. కొలత్తూరులో టీవీకే అభ్యర్థి చేతిలో స్టాలిన్ ఓటమిపాలయ్యారు. స్టాలిన్ పై వీఎస్ బాబు ఘన విజయం సాధించారు.

స్టాలిన్ కొలత్తూరు నుంచి పోటీ చేయడం ఇది నాలుగోసారి. కొలత్తూరును తన సొంత నియోజకవర్గంగా భావిస్తూ వచ్చారు స్టాలిన్. కానీ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో ఓటమి చవిచూశారు స్టాలిన్.

తమిళనాడులోని కొలత్తూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో హోరాహోరీ పోరులో తలపడ్డ సీనియర్ రాజకీయ నాయకుడు వి.ఎస్. బాబు అనూహ్య విజయం సాధించారు. దీంతో వీఎస్ బాబు పేరు మార్మోగిపోతోంది. ఏకంగా ముఖ్యంత్రి స్టాలిన్ ని మట్టికరిపించిన విజయ్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారారు. అసలు ఎవరీ వీఎస్ బాబు, ఆయన నేపథ్యం ఏంటి అనే వివరాలు తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు.

టీవీకే చీఫ్ విజయ్ వదిలిన బాణమే వీఎస్ బాబు. వీఎస్ బాబు మాజీ డీఎంకే ఎమ్మెల్యే. తర్వాత తమిళగ వెట్రి కజగం (టీవీకే)లో చేరారు. వయసు 75 ఏళ్లు. దీర్ఘకాలంగా డీఎంకే కంచుకోటగా పరిగణించబడుతున్న ప్రాంతంలో తన బలమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

తమిళనాడు 17వ శాసనసభకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో స్టాలిన్ వరుసగా రెండోసారి పదవిని చేపట్టాలని కలలు కన్నారు. ఆయన కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.

విఎస్ బాబు గురించి ఐదు ముఖ్యమైన విషయాలు..

1. బాబు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. 75 ఏళ్ల ఈయన 2006 ఎన్నికలలో డీఎంకే అభ్యర్థిగా గెలిచి గతంలో పురసవాక్కం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఫిబ్రవరి 7, 2026న టీవీకేలో చేరారు.
2. ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 2006 నుండి 2011 వరకు పురసవాక్కం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో ఏఐఏడీఎంకే అభ్యర్థిని 90వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఓడించారు.
3. 2026 అఫిడవిట్ ప్రకారం తనకు రూ.3.7 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.
4. దీర్ఘకాలంగా డీఎంకే కంచుకోటగా పరిగణించబడుతున్న నియోజకవర్గంలో స్టాలిన్ ను మట్టికరిపించారు.
5. నటుడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, ఆయన పార్టీ టీవీకే ఆవిర్భావం ఒక ట్రెండ్ సెట్ చేసింది. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకుని, యువ ఓటర్లను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు విజయ్.

Also Read: తమిళనాట విజయ్ ప్రభంజనం.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్